తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సినిమాల్లో అవకాశం రావడానికి ముందు వాళ్లు పలు రకాల పనులను చేస్తూ సినిమా ఇండస్ట్రీలో తమ మనుగడను కొనసాగిస్తారు.ఇక ఇలాంటి క్రమంలోనే నటుడుగా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శివాజీ( Sivaji ) కూడా మొదట యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించి, ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారి అప్పటినుంచి నటుడిగా గా కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన చాలా సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు రకాల పాత్రలను పోషించాడు.ఇక మొత్తానికైతే ప్రస్తుతం ఆయన 90స్ అనే వెబ్ సిరీస్( 90s Webseries ) చేసి మరోసారి నటుడి గా తన సత్తాను చాటుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే అప్పట్లో ఆయన కొంతమంది స్టార్ హీరోలకి డబ్బింగ్ చెప్పాడనే విషయం చాలామందికి తెలియదు.ముఖ్యంగా ‘చిత్రం ‘ సినిమాలో ఉదయ్ కిరణ్ కి,( Uday Kiran ) ‘దిల్ ‘ సినిమాలో నితిన్ కి( Nithin ) పిజ్జా సినిమాలో విజయ్ సేతుపతికి( Vijay Sethupathi ) సైతం డబ్బింగ్ చెప్పి తన గాత్రంతో ఆ హీరోల యొక్క క్యారెక్టర్స్ ని ఎలివేట్ చేశాడు.
ఇక దిల్ సినిమాలో నితిన్ కి డబ్బింగ్ చెప్పినందుకు గాను ఆయనకు నంది అవార్డు కూడా వచ్చింది.

అయితే తనదైన రీతిలో స్టార్ హీరోలందరికి డబ్బింగ్ చెప్పడం అనేది చాలా మంచి విషయమనే చెప్పాలి.ఇంకా ప్రస్తుతం ఆయన కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ తన మనగడని ఇంకా ఎక్కువ రోజుల పాటు కొనసాగించాలనే సంకల్పంతో ఆయన బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ప్రస్తుతం ఆయన బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వచ్చే సినిమాలో కూడా నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఇక ప్రస్తుతం ఆయన ఆ సినిమా కోసం ఫిట్నెస్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక మొత్తానికి శివాజీ నటుడిగా చాలా మంచి జోరు మీద ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ ఇయర్ ఆయన సూపర్ ఫామ్ లో ఉన్నాడు…
.