సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటించిన సీరియల్స్ ఏంటో తెలుసా ?

గత శుక్రవారం విడుదలైన బింబిసారా, సీతా రామం సినిమాలు అద్భుతంగా తెలుగు సినిమా పరిశ్రమకు రెండు విజయాలుగా నిలిచాయి.సీతా రామం సైతం బింబిసారా చిత్రానికి పోటీనిస్తూ కల్ట్ క్లాసికల్ మూవీగా బాక్సాఫీస్ దుమ్ము దులిపుతుంది.

 Do You Know List Of Serials Acted By Mrunal Thakur , List Of Serials,mrunal Thak-TeluguStop.com

ఈ చిత్రానికి మన తెలుగు దర్శకుడు అయిన హను రాఘవపూడి దర్శకత్వం వహించగా, ఇందులో రామ పాత్రలో మమ్ముట్టి కుమారుడు దుల్కర్ హీరోగా నటించాడు.ఇక సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.

ఇక మృణాల్ కి ఇదే తొలి తెలుగు సినిమా అయినప్పటికీ కూడా ఆమె అందంతో, అభినయంతో అందరినీ ఆశ్చర్యపరిచింది.

Telugu @dulquer, Bimbisarasita, Kunkuma Bhagya, List Serials, Love Sonia, Mrunal

ఇక ఈ సినిమా విజయం సాధించడంతో, చాలామంది మృణాల్ గురించి, ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకునే పనిలోపడ్డారు.అంతే కాదు మృణాల్ గురించి సోషల్ మీడియాలో సైతం ఎక్కువగా చర్చ జరుగుతుంది.వాస్తవానికి ఈమె పుట్టింది మహారాష్ట్రలోని ధులే ప్రాంతంలో.

చదువంతా కూడా ముంబై లోనే సాగింది.ఇక మాస్ కమ్యూనికేషన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి నటన పైన ఉన్న ఆసక్తి తో తొలుత టీవీ రంగంలోకి అడుగు పెట్టింది.

ముజ్ సే కుచ్ కెహతి.యే కామోషియన్

Telugu @dulquer, Bimbisarasita, Kunkuma Bhagya, List Serials, Love Sonia, Mrunal

అనే సీరియల్ ద్వారా 2012 లో సీరియల్ ఇండస్ట్రీ లో కెరీర్ మొదలుపెట్టింది.అలాగే కుంకుమ భాగ్య అనే మరో సీరియల్ లోను నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Telugu @dulquer, Bimbisarasita, Kunkuma Bhagya, List Serials, Love Sonia, Mrunal

ఇక తన నటించిన మొదటి సినిమా మరాఠీ లోనే కావడం విశేషం.అది మరీదో కాదు వట్టిదండు.ఆ తర్వాత 2018 లో బాలీవుడ్ లో లవ్ సోనియా అనే ఒక మరో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.ఇక హృతిక్ రోషన్ సినిమా సూపర్ 30లోను, అలాగే బట్లా హౌస్ సినిమాలో జాన్ అబ్రహం తోను కలిసిన నటించింది.

ఈ రెండు కూడా మంచి కమర్షియల్ సినిమాలుగా సక్సెస్ సాధించడంతో షాహిద్ కపూర్ జెర్సీ సినిమాలో సైతం హీరోయిన్ గా నటించే అవకాశం ఆమెను వరించింది.ఇక మృణాల్ నటించిన సీతా రామం సినిమాలో సైతం మృణాల్ ఠాగూర్ కి చాలా మంచి మార్కులే పడ్డాయి.

ఇక కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు ఆమె నటనకు ప్రాధాన్యం ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ తెలుగు హీరోయిన్స్ కి సవాల్ విసిరితోంది.ఏది ఏమైనా ఈ సినిమా విజయం తర్వాత మృణాల్ కి తెలుగు లో సైతం మంచి అవకాశాలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube