బర్రెలక్క శిరీషకు ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసా..?

రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ముగిసింది.ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి.కొన్ని కొన్ని ప్రాంతాల్లో చిన్నచిన్న అలజడలు మినహా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు.119 నియోజకవర్గాల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని ఓట్లు వేశారు.అన్ని బ్యాలెట్లు నిండిపోయాయి.దీంతో వివి ప్లాట్లు, బ్యాలెట్లు అన్ని స్ట్రాంగ్ రూము లోకి చేరాయి.3 తారీకు అభ్యర్థుల భవితవ్యం బయటకు రాబోతోంది.దీంతో చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ( BRS ) కాంగ్రెస్ మధ్య విపరీతమైనటువంటి పోటీ ఉంది.

 Do You Know How Many Votes Barrelakka Sirisha Got , Barrelakka Sirisha, Kollapur-TeluguStop.com

ఈ సందర్భంలోనే అభ్యర్థులు కూడా రిజల్ట్ ఎలా ఉండబోతోంది అనీ చాలా టెన్షన్ పడుతున్నారు.

ఇక ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ వైఫై మొగ్గు చూపాయి.మరి నిజంగానే కాంగ్రెస్ గెలుస్తుందా.లేదంటే బీఆర్ఎస్ విజయతీరాలకు చేరుతుందా.

అనేది 3 తారీకు తెలియనిది.ఇక ఈ ఎన్నికల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన నియోజకవర్గం కొల్లాపూర్( Kollapur ) .ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క శిరీష పోటీ చేసింది.దీంతో ఈమె సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది.

బర్రెలక్క శిరీష (Barrelakka Sirisha) గెలవాలని రాష్ట్ర ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా కోరుకున్నారు.రెండు లక్షల 20 వేల వరకు ఓటర్లు ఉన్నటువంటి కొల్లాపూర్ నియోజకవర్గంలో బర్రెలక్కకు పడ్డ ఓట్లు దాదాపుగా 15వేల నుంచి 20వేల వరకు ఉంటాయని తెలుస్తోంది.ఆమె అక్కడ గెలుపు సాధించకపోయినా కానీ, ఒక సాధారణ వ్యక్తిగా పోటీ చేసి అధికార పార్టీలకు చుక్కలు చూపించిందని చెప్పవచ్చు.ఈ తరం ఎంతో మంది యువతకు ఇన్స్పిరేషన్ గా నిలిచిందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube