ఇండస్ట్రీ లో ప్రతి హీరో కూడా తమ ఎంటైర్ లైఫ్ లో వీలైనన్ని ఇండస్ట్రీ హిట్స్ కొట్టాలని చూస్తూ ఉంటారు…అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ లో టాప్ చైర్ కోసం పోటీ పడుతున్నా హీరోల్లో ఎవరు ఎన్ని సార్లు ఇండస్ట్రీ హిట్ కొట్టారో ఒకసారి మనం తెలుసుకుందాం.మొదటగా మహేష్ బాబు( Mahesh Babu ) గురించి తీసుకుంటే ఆయన చేసిన సినిమాల్లో పోకిరి ఇండస్ట్రీ హిట్ కొట్టింది…అప్పటి వరకు ఇంద్ర సినిమా పేరు మీద ఉన్న రికార్డులు మొత్తాన్ని బ్రేక్ చేస్తూ ఈ సినిమా విజయం సాధించింది…ఇక దూకుడు కొంత వరకు పర్లేదు అని అనిపించినప్పటికీ అప్పటి వరకు ఉన్న మగధీర రికార్డ్ ని మాత్రం బ్రేక్ చేయలేకపోయింది…ఇక శ్రీమంతుడు సినిమా విషయానికి వస్తె ఈ సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టింది…అంటే మొత్తంగా మహేష్ బాబు ఇప్పటి వరకు రెండు సార్లు ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు.
పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరి లో ఎక్కువ క్రేజ్ అలాగే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ).ఈయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది.పవన్ కళ్యాణ్ హీర్ గా వచ్చిన సినిమా ల్లో ఖుషి సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది అలాగే ఈ సినిమా తో పాటు గా అత్తారింటికి దారేది సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టింది.మొత్తం పవన్ కళ్యాణ్ కూడా రెండు సార్లు ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.

రామ్ చరణ్( Ram Charan ) రామ్ చరణ్ తన కెరియర్ లో మగధీర,రంగస్థలం లాంటి సినిమాలతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అంటే రామ్ చరణ్( Ram Charan ) తన కెరియర్ లో ఇప్పటి వరకు రెండు సార్లు ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.
ప్రభాస్ ( Prabhas ) ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ బాహుబలి( Bahubali ) తో రెండు సార్లు ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.మొత్తానికి ప్రభాస్ చేసిన ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ సాధించాయి.ఇలా ప్రభాస్ రెండు సార్లు ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.

అల్లు అర్జున్ ( Allu Arjun ) అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అలా వైకుంఠపురం( ala Vaikunthapuram ) లో సినిమా తో ఆయన ఇండస్ట్రీ హిట్ కొట్టాడు….ఇలా అల్లు అర్జున్ ఒక్కసారి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.
ఎన్టీయార్( NTR ) ఎన్టీయార్ తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయినప్పటికీ ఒక్క సినిమా కూడా ఇప్పటి వరకు ఇండస్ట్రీ హిట్ కొట్టలేక పోయింది… సింహాద్రి బ్లాక్ బస్టర్ హిట్ గా మాత్రమే నిలిచింది.








