సెప్టెంబర్‌లో స్కూళ్లకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసా..?

పండుగల సీజన్ వచ్చింది.సెప్టెంబర్ నుంచి వరుస పండుగలు రాబోతున్నాయి.

దసరా, దీపావళి, వినాయక చవితి( Dussehra, Diwali, Vinayaka Chavithi ) లాంటి ప్రధాన పండుగలు రానున్న నెలల్లో రానున్నాయి.హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగలు ఇవే.దీంతో స్కూళ్లకు సెలవులు రాబోతున్నాయి.సెప్టెంబర్ నెలలో స్కూళ్లు, కాలేజీలకు సంబంధించిన సెలవుల జాబితా( holidays ) వచ్చేసింది.

వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్ హాలీడేస్ ఏమీ ఉండవు.అయితే రాష్ట్ర పండుగుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులు నిర్ణయించాయి.

కొన్ని రాష్ట్రాల్లో పండుగలను ప్రత్యేకంగా జరుపుకుంటారు.ఈ పండుగల సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తాయి.

Advertisement

సెప్టెంబర్ నెలలో చూసుకుంటే.సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం( Teachers Day ) వస్తుంది.మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా టీచర్స్ డే జరుపుకుంటారు.

దీంతో ఆ రోజు స్కూల్స్, కాలేజీలకు సెలవు ఇవ్వనున్నారు.ఇక రెండో శనివారం, ఆదివారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉండనుంది.

ఆంధ్రప్రదేశ్ లో సెప్టెంబర్ 7న శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 19న వినాయక చతుర్ధి, సెప్టెంబర్ 28న మిలాద్ ఉన్ నబీ, ఈద్ ఎ మిలాద్ సందర్భంగా స్కూళ్లకు సెలవులు రానున్నాయి.

ఇక తెలంగాణలో సెప్టెంబర్ 6న కృష్ణ జయంతి( Krishna Jayanti ), సెప్టెంబర్ 17న వినాయక చతుర్ధి, సెప్టెంబర్ 28న మిలాద్ ఉన్ నబీ సందర్బంగా సెలవులు ప్రకటించారు.ఇక ఒడిశాలోని స్కూళ్లు, కాలేజీలకు కూడా సెప్టెంబర్ 6న శ్రీకృష్ణజన్మాష్టమి, సెప్టెంబర్ 19న గణేష్ పూజ, సెప్టెంబర్ 20న నుఖాయ్, సెప్టెంబర్ 29న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవులు ఇచ్చారు.అలాగే సెప్టెంబర్ 19న వినాయక చతుర్ధి, సెప్టెంబర్ 28న మిలాద్ ఉన్ నబ్ సందర్భంగా కర్ణాటకలోని స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
జగన్ కు ఇదే అతిపెద్ద సవాల్ ! మారుతారో మార్చుతారో ? 

కాగా వినాయక చవితి వచ్చే నెలలో ఉండనుంది.

Advertisement

తాజా వార్తలు