NTR Assets: ఏడాదిలో తారక్ ఆస్తులు ఈ రేంజ్ లో పెరిగాయా.. ప్రస్తుతం వాటి విలువ ఎంతంటే?

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్( NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Do You Know How Many Hundreds Of Crores Ntr Assets Are Worth Here Are The Detai-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో( RRR ) ప్రేక్షకులను పలకరించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే.అంతేకాకుండా గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ సినిమాతో ఎన్టీఆర్ ను అభిమానించే వారి సంఖ్య మరింత పెరిగింది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Telugu Assets, Devara, Ntr, Koratala Siva, Ntr Assets, Ntr Net Worth, Ntr Privat

ఇందులో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఆస్తులకు సంబంధించి వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఎన్టీఆర్ ఆస్తులు మరింత పెరిగాయి.కాగా ఎన్టీఆర్ నేడు 40 పుట్టిన రోజు( NTR Birthday ) వేడుకలను జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

ఇకపోతే ఎన్టీఆర్ ఆస్తుల విషయానికి వస్తే.రూ.25 కోట్ల విలువైన విలాసవంతమైన భవనంతో పాటు 80 కోట్ల విలువ చేసే ప్రైవేట్ జెట్ ఉంది.వీటికి తోడు బృందావనం పేరుతో ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉందట.

వీటితో పాటు బెంగుళూరులో కూడా తారక్ కు కొన్ని ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

Telugu Assets, Devara, Ntr, Koratala Siva, Ntr Assets, Ntr Net Worth, Ntr Privat

వీటికి తోడు ఆయన కొన్ని ఖరీదైన కార్లు, వాచీలు కూడా ఉన్నాయి.అలా మొత్తంగా ఎన్టీఆర్ ఆస్తి విలువ రూ.571 కోట్లు ఉంటుందని అంటున్నారు.మరోవైపు ఎన్టీఆర్ నెలవారీ ఆదాయం రూ.3 కోట్లు వరకు ఉంటుందని అంచనా.దానికి తోడు ఎన్టీఆర్ తన సినిమా సినిమాకి రెమ్యూనరేషన్ ని పెంచుకుంటూ పోతున్నాడు.అంతేకాకుండా ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ సినిమాకు దాదాపుగా 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకు పోతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube