నాగ పాములు గుడ్లను ఎలా పెడతాయో తెలుసా.... వీడియోలో చూస్తే షాక్ అవుతారు....

పక్షి జాతికి చెందిన పక్షులు గుడ్లు పెడతాయని దాదాపు అందరికీ తెలిసిన విషయమే.పక్షులు గుడ్లు పెట్టడాన్ని చాలామంది ఎప్పుడో ఒకసారి చూసే ఉంటారు.

 Do You Know How Cobras Lay Eggs , King Cobra,odisha, Snake Catcher, Cobras Lay E-TeluguStop.com

కోళ్లు వాటి గుడ్లను పొదిగి పిల్లలను తీయడం కూడా చాలామంది చూస్తూ ఉంటారు.అయితే పాము కనిపిస్తే దూరంగా పరిగెత్తే వారు అవి గుడ్లను పెట్టడం ఎప్పుడూ చూసి ఉండరు.

పాము గుడ్లను నోటి నుండి పెడుతుందా, లేక తోక వెనుక భాగం నుండి పెడుతుందా ఈ వీడియో లో చూస్తే అందరికీ తెలిసిపోతుంది.

ప్రతి ఆడ పాము తోక వద్ద ఉండే భాగం నుంచి గుడ్లను పెడుతుంది.

ఓవిపరస్ జాతికి చెందిన మోనోక్లెడ్ ​​కోబ్రా కూడా తోక భాగం నుంచే గుడ్లను పెడుతుంది.మోనోక్లెడ్ ​​కోబ్రా గుడ్లను పెట్టేటప్పుడు బాగా అవస్థలు పడుతుంది.ఓసారి శరీరం భాగం మొత్తాన్ని చుట్టుకుని, మరోసారి పొడవుగా ఉంటూ గుడ్లను పెట్టడానికి ప్రయత్నిస్తుంటుంది.ఈ వీడియోలో మోనోక్లెడ్ ​​కోబ్రా గుడ్లను పెట్టేటప్పుడు పడే బాధను మనం చూస్తాం.

మోనోక్లెడ్ ​​కోబ్రా గుడ్లను పెడుతున్న వీడియోను ఒడిశాలో చాలా ఫేమస్ అయిన స్నేక్ క్యాచర్ మీర్జా ఎండీ ఆరిఫ్ తన సొంత యూట్యూబ్‌ ఛానెల్లో పోస్ట్ చేశాడు.

ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ వీడియోకి కోట్లలో వ్యూస్ వచ్చాయి.

పాములు గుడ్లను పెట్టడం చూడటం అద్భుతంగా ఉందంటూ చెబుతున్నారు.మోనోక్లెడ్ ​​కోబ్రా జాతికి చెందిన ఆడపాములు వర్షాకాలం తర్వాత సంభోగంలో పాల్గొంటాయి.

ఆడపాము జనవరి నుంచి మార్చి మధ్య పొడి మట్టి దిబ్బలు, గుహలు లేదా రంధ్రాలలో గుడ్లను పెడతాయి.ఈ పాము 16 నుంచి 33 గుడ్లు పెడుతుంది.

సుమారు 2 నెలల పాటు ఈ గుడ్లను పొదుగుతుంది.మోనోక్లెడ్ ​​కోబ్రా పుట్టినప్పుడు 8 నుండి 12 అంగుళాల పొడవు ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube