అల్లు అర్జున్ కు పుష్ప లారీ గిఫ్ట్ గా ఇచ్చింది ఎవరో తెలుసా... అసలు విషయం చెప్పిన బన్నీ!

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టైలిష్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయారు.ఇలా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న అల్లు అర్జున్ కు విపరీతమైన అభిమానులు కూడా పెరిగిపోయారు.

 Do You Know Gave Pushpa Lari As A Gift To Allu Arjun Bunny Told The Truth, Pushp-TeluguStop.com

ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ఆయన మేనరిజానికి ఎంతో మంది అల్లు అర్జున్ కు అభిమానులుగా మారిపోయారు.ఇక పుష్ప సినిమా మొత్తం గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు ఆయన నడిపే లారీలు కూడా ఎంతో ఫేమస్ అయ్యాయి.

అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటించారు.ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ చిత్రం షూటింగ్ తో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఈ సినిమా షూటింగ్లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే తనకు లభించిన అరుదైన బహుమతి గురించి కూడా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నడిపిన లారీలను తనకు ఒక క్యూట్ పర్సన్ గిఫ్ట్ గా ఇచ్చాడని ఈ సందర్భంగా అల్లు అర్జున్ తెలిపారు.

ఈ విధంగా పుష్ప రాజ్ కోసం ప్రత్యేకంగా అలాంటి లారీలను తనకు గిఫ్టుగా ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరు అనే విషయానికి వస్తే తను మరెవరో కాదు అల్లు అర్జున్ కుమారుడు అయాన్ అని ఈయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు.నా స్వీటెస్ట్ సోల్ అయాన్ చిన్ని బాబు నుంచి అందమైన బహుమతి అంటూ పుష్ప బొమ్మ లారీ ఫోటోని షేర్‌ చేశాడు బన్నీ.ప్రస్తుతం ఇది వైరలవుతోంది.ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube