సినిమా అనేది మానవ జీవితంలో ఓ భాగంగా మారిపోయింది.మంచో.
చెడో.ఏదో ఒకటి గానీ.
జనాల మీద దీని ప్రభావం చాలా అంటే చాలా ఉంది.జనాలను మానసిక ఉల్లాసం కోసమే కాదు.
సమాజంలో జరిగే పోకడను అద్భుతంగా తెరకెక్కిస్తారు దర్శకులు.సుమారు మూడు గంటల పాటు బయటి ప్రపంచాన్ని మర్చిపోయేలా చేస్తారు.సినిమా అయిపోయాక.ఒక మంచి అనుభూతికి లోనవుతారు జనాలు.అయితే ప్రపంచంలో తొలిసారి ఈ సినిమాను ఎక్కడ? ఎవరు తెరకెక్కించారు? ఆ సినిమా పేరేంటి? అసలు సినిమాను కనిపెట్టింది ఎవరు? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రపంచంలో తొలి సినిమా రౌండ్ హౌస్ గార్డెన్ సీన్స్.
1888లో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాకు లూయిస్ లే అనే వ్యక్తి దర్శకత్వం వహించాడు.
ఈ మూవీని లండన్ లో షూట్ చేశారు.ఈ సినిమా నివిడి కేవలం 1 నిమిషం 66 సెకెన్లు మాత్రమే.
అయితే ఆ తర్వాత బాగా ఫేమస్ అయిన సినిమా మాత్రం లా సియోటాల్ స్టేషన్ అనే సినిమా.ఇది ఓ చిన్న డాక్యుమెంటరీ.
దీన్ని 1895 లో షూట్ చేశారు.ప్రపంచంలో తొలిసారి ఈ సినిమా చూసి జనాలు బాగా సంతోష పడ్డారు.
ఇందులోని సీన్లు చూసి కొందరు సీట్ల మీద నుంచి దూకి పారిపోయారట.ఆ తర్వాత లూమియర్ సోదరులు ది వాటర్డ్ వాటరర్ అనే సినిమా తీశారు.
అయితే 1900 సంవత్సరంలో సినిమా పొడవు 20 నిమిషాలకు పెరిగింది.అయితే తొలిసారి సౌండ్ తో వచ్చిన సినిమా మాత్రం జాజ్ సింగర్.
ఈ సినిమా అప్పట్లో సంచలనంగా చెప్పుకోవచ్చు.
ఆ తర్వాత కలర్ సినిమాల రాక మొదలైంది.1925లో ఈ సినిమా తెరకెక్కింది.పూర్తి నిడివి కలిగిన ఈ సినిమా మూవీ ఇండస్ట్రీలో ఓ సంచలనం అని చెప్పుకోక తప్పదు.
అప్పట్లో కేవలం కొంత మంది మాత్రమే సినిమాను చూసే అవకాశం ఉండేది.కానీ ప్రస్తుతం సినిమా అనేది అందరికీ అందుబాటులోకి వచ్చింది.ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి చేరువైంది.ప్రస్తుత తరుణంలో సినిమా పాత్ర ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతగానో నిలిచిపోయింది.
ప్రతి వ్యక్తి వారానికి కనీసం ఒక సినిమా అయినా చూసే పరిస్థితి ఉంది.