నాని హీరోగా నటించిన తాజా చిత్రం దసరా విడుదలకు ముందు నుంచి చాలా హైట్ క్రియేట్ అవ్వబడి విడుదల కాగానే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.ఈ సినిమా మొదటిరోజు టాక్ తోనే మంచి బ్లాక్ బస్టర్ సినిమాగా అవతరించబోతుందని నాని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఇక దసరా( Dasara ) సినిమా పాన్ ఇండియా సినిమా గా పలు భాషల్లో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.దసరా సినిమాకు ఈ రేంజ్ పాజిటివ్ గాక రావడానికి గల ముఖ్య కారకుల్లో ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ఉండగా, నాని మరియు కీర్తి సురేష్ నటన కూడా హైలెట్ గా చెప్పుకోవచ్చు.
ఇక ఈ చిత్రంలో విలన్ గా నటించిన నటుడు షైనీ టామ్ కూడా అద్భుతమైన విలనిజం పండించడంతో సినిమాకి ఇంత మంచి పాజిటివ్ వైబ్ ఏర్పడింది.

అయితే షైనీ టామ్( Shine Tom Chacko ) కి ఇదే తెలుగులో మొదటి సినిమా కావడం విశేషం.ఇంతకు ముందు మలయాళం లో అనేక సినిమాల్లో నటించిన టామ్ మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులనీ తనదైన రీతిలో నటించి అలరించాడు.70 కి పైగా సినిమాల్లో నటించిన టామ్ కొన్ని చిత్రాల్లో హీరోగా నటిస్తే మరికొన్ని సినిమాల్లో విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో నటించాడు.గడ్డల అనే సినిమాతో మలయాళంలో నటుడిగా వెండి తెర కు పరిచయం అయ్యాడు.దసరా సినిమా విషయానికి వస్తే కామం తో కూడిన క్రోదమైన పాత్రలో టామ్ నటన అద్భుతం అని చెప్పచ్చు.
మలయాళం లో విలక్షణమైన నటులలో టామ్ ఒకరు.

మలయాళీ మూవీ అయిన ఇష్క్ లో విలన్ గా తన అద్భుతమైన నటనకు గానీ టామ్ సైమా అవార్డ్( SIIMA Award ) లభించింది.శ్రీకాంత్ ఓదెల టామ్ లోని ఒక భిన్నమైన నటుడిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు.ఇక దసరా విజయం తర్వాత టామ్ కి మరిన్ని తెలుగు సినిమాలు వచ్చి బిజీ స్టార్ గా మారిపోయే అవకాశం పుష్కలం గా ఉంది.
ఇప్పటికే ప్రకాష్ రాజ్ లాంటి విలక్షణ నటులు ఫెడ్ ఔట్ అవుతున్న క్రమం లో మలయాళీ నటులు తెలుగు తెరకు పరిచయం కావడం ఎక్కువగా పెరిగింది.ఈ దశలో ప్రకాష్ రాజ్ నీ సైతం రీప్లేస్ చేసే నటుడిగా టామ్ ఎదుగుతాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు.
