ఇద్దరు ఏపీ ఎమ్మెల్యే సోదరులు టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్లు.. ఎవరో తెలుసా?

తెలుగు రాష్ట్రాలలో సినిమాలను రాజకీయాలను వేరు చేయలేము.ఈ కల్చర్ నందమూరి తారక రామారావు రాజకీయాలలోకి అడుగుపెట్టినప్పటి నుంచి కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే.

 Do You Know 2 Andhra Pradesh Mlas Own Brothers Are Tollywood Top Directors Detai-TeluguStop.com

అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో సీనియర్ హీరోలు అలాగే యంగ్ హీరోలు ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయ పార్టీలకు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే.రాజకీయ పార్టీలకు తమ వంతుగా సపోర్ట్ తెలుపుతున్న విషయం తెలిసిందే.

ఎలక్షన్స్ సమయంలో అయితే చిన్నచిన్న ఆర్టిస్టుల నుంచి పెద్దపెద్ద హీరోల వరకు కూడా రాజకీయ పార్టీలకు మద్దతుగా ఓట్లు వేసి గెలిపించమని కూడా కోరుతూ ఉంటారు.

Telugu Puri Jagannath, Kalyan Krishna, Mlakurasala, Petlauma, Brothers, Tollywoo

అయితే సినిమా ఇండస్ట్రీలో కొందరు దర్శక నిర్మాతలు అలాగే హీరో హీరోయిన్లు ల వెనుక రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉంది.ఇకపోతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని ఇద్దరు ఎమ్మెల్యేల సోదరులు ప్రస్తుతం టాలీవుడ్ లో దర్శకులుగా రాణిస్తున్నారు.అయితే అదేదో దూరపు చుట్టం అనుకుంటే పొరపాటే.

ఒక తల్లి కడుపున రక్తం పంచుకు పుట్టిన సోదరులు.కాగా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వైసీపీ పార్టీకి చెందిన వారే.

మరి ఆ ఎమ్మెల్యేలు ఎవరు ఆ దర్శకులు ఎవరు అన్న వివరాల విషయానికి వస్తే.టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరులు మరెవరో కాదు పెట్ల ఉమేష్ శంకర గణేష్.ప్రస్తుతం ఏపీ ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్నారు.2019 ఎన్నికలలో నర్సీపట్నం నియోజకవర్గం నుంచి వైసీపీ నుండి పోటీ చేసి గెలుపొందారు.

Telugu Puri Jagannath, Kalyan Krishna, Mlakurasala, Petlauma, Brothers, Tollywoo

అలాగే మరో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. తెలుగులో సోగ్గాడే చిన్నినాయన, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఎమ్మెల్యే కొరసాల కన్నబాబుకి స్వయానా సోదరుడు.కురసాల కన్నబాబు 2019 ఎన్నికలలో కాకినాడ రూరల్ స్థానానికి వైసీపీ నుంచి పోటీ చేసి శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.2009 ఎన్నికలలో కూడా ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి గెలుపొందారు కొనసాల కన్నబాబు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube