ప్రముఖ నేపథ్య గాయని చిత్ర పాటతో ఘనంగా ప్రారంభమైన యం.యన్.ఆర్. ఆర్ట్స్ చిత్రం "ఊహకు అందనిది"

గంగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రముఖ నేపథ్య గాయని చిత్ర పాడిన శ్రీ రాముడా, కృష్ణుడా, ఈశ్వరుడా అనే పాట రికార్డింగ్ తో యం.యన్.

 Mnr Arts Productions Oohaku Andanidi Movie Launched With Singer Chitra ,oohaku A-TeluguStop.com

ఆర్.ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ గా ప్రారంభమైన నూతన చిత్రం “ఊహకు అందనిది”..ఈ సినిమాను భారీ బడ్జెట్ తరహాలో హై గ్రాఫిక్స్ తో పాటు అత్యంత హై టెక్నికల్ వేల్యూస్ కలిగిన నిర్మాణ విలువలతో నిర్మించబోతున్నారు .ఈ సినిమా టైటిల్ చదివినప్పుడు టైటిల్ లోనే సినిమా యొక్క బ్యాగ్రౌండ్ లైన్ ఎవరి ఊహకు అందదు అనే కాన్సెప్ట్ ని రివీల్ చేశారు.ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ అనేది అందరికీ అర్థమవుతుంది.

ఇప్పటివరకు వచ్చిన అమ్మోరు, అరుంధతి తరహా అత్యంత భారీ బడ్జెట్ సినిమాలకూ ఏ మాత్రం తీసిపోని విధంగా తీయడానికి సిద్ధపడుతున్నారు నిర్మాతలు.మంచి కంటెంట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో భారీ తారాగణం తో పాటు కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వడం విశేషం.

హైదరాబాద్ తో పాటు చెన్నైలోనూ భారీ ఎత్తున సెట్టింగ్స్ వేసి షూటింగ్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు .ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ భారీ స్థాయిలో జరుగుతుంది.అత్యంత వైభవంగా ఏప్రిల్ లో షూటింగ్ మొదలు పెట్టి డిసెంబర్ లో చిత్రాన్ని పూర్తి చేసి జనవరిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.ఈ సినిమాలోని నటీ, నటుల విషయాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube