కాలంతోపాటు ఎగిరాల్సిందేనా?.. బైక్ నడుపుతూనే డ్యూటీ చేస్తున్న ఎంప్లాయ్!

కాలం పూర్తిగా మారిపోయింది.మానవ సంబంధాలు అడుగంటిపోయాయి.

 Do You Have To Fly With The Times  An Employee Who Is Doing Duty While Riding A-TeluguStop.com

డబ్బు సంపద రాజ్యమేలుతోంది.దాంతో మనిషి కాలచక్రం అనే దాంతో కొట్టుమిట్టాడుతున్నాడు.

ఎంత‌గా అంటే, వీకెండ్ సెల‌వులో కాస్త రెస్టు తీసుకుందామని అనుకునే లోపే సెల‌వు సేకునులో ఇలా వచ్చి, అలా పోతుంది.కాలానికి అనుగుణంగా ఇపుడు మారుని పరుగులు పెట్టడం కాదు, ఎగరాల్సిన పరిస్థితి వచ్చింది.

విన‌డానికి కాస్త అతిశ‌యోక్తిగా అనిపించినా ఇది నగ్నసత్యం.అందులోనూ, కార్పొరేట్ ఉద్యోగుల ప‌రిస్థితి మ‌రింత హీనమనే చెప్పుకోవాలి.

ఇక్కడ ఎవ‌రి బాధ్య‌త వారిది, ఎవ‌రి బాధ‌లు వాళ్ల‌వి.మనలో అనేకమందికి కనీసం తినడానికి కూడా సమయం దొరకదంటే నమ్మశక్యంగా ఉండదు.అలా పనిచేస్తేనే రెండు రాళ్లు సంపాదిస్తున్నాడు.లేదంటే లేదు.

అయితే ఇక ఎంత సంపాదించినా, రానురాను పెరిగిపోతున్న నిత్యావసర ధరలుతో మనిషి సతమతమవుతున్నాడు. ఇక ప్రయాణాల్లో కూడా అంటే.

ఆఫీసులనుండి బయటకి వచ్చాక కూడా అతడికి బాధ్యతులు వదలట్లేదు.తాజాగా ఓ బైకర్ తన బైకుమీద ఉండగానే ఏదో పనిచేస్తున్నట్టు కనబడిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

లింక్డ్‌ఇన్ యూజర్ హర్ష్‌మీత్ సింగ్ సదరు పోస్ట్ చేసాడు.చేస్తూ.“బెంగళూరు నగరంలో 11pm సమయంలో ఓ వ్యక్తి తన లాప్ టాప్ లో పనిచేస్తున్నాడు.ఆఫీస్‌లో బాస్‌ సహోద్యోగులను భయాలకు గురిచేస్తే, బాస్ సొంత సౌక‌ర్యం, భ‌ద్ర‌త కోసం ఉద్యోగుల‌కు డెడ్‌లైన్లు ఇస్తుంటే, వాళ్లు మరోసారి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది” అని సింగ్ ఈ చిత్రాన్ని చాలా భావోద్వేగంతో పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నెటిజన్లు దీనిపైన పెద్దఎత్తున స్పందిస్తున్నారు.‘వుద్యోగం అంటే బానిసత్వం’లాగా ఉందని కొందరంటే, ‘నేటి కాలచక్రంలో కొట్టుకొని పోవాల్సిందే’ అని మరికొందరు స్పందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube