తెలంగాణలో భాజాపా వాయిస్ ను వివిధ మీడియా వేదికల మీద బలం గా వినిపించే యువనేత, రాష్ట్ర అదికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి( Enugula Rakesh Reddy ) భాజపా పార్టీని వీడారు.వరంగల్ పశ్చిమ టిక్కెట్ ఆశించిన ఆయనకు పార్టీ హ్యాండ్ ఇచ్చింది .ఆ టికెట్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మా అమరేందర్ రెడ్డికి ( Padma Amarender Reddy )కేటాయించడంతో పార్టీపై అసంతృప్తితో ఆయన పార్టీకి రాజీనామా చేశారు.11 సంవత్సరాలు గా ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని పార్టీ కోసం ప్రాణం పెడితే ఇప్పుడు పార్టీ తనను గుండెలపై తన్నిందని, వయసు పూర్తిగా ఉడిగిపోయి నేత్తురు చచ్చాక అప్పుడు ఇస్తారా టికెట్? అంటూ ఆయన బిజెపి పై అధిష్టానం పై పైరయ్యారు.రాష్ట్ర అధికార ప్రతినిదినైన తనకు జిల్లా పార్టీ ఆఫీస్ లో మీడియా సమావేశం పెట్టే స్వేచ్ఛ కూడా ఇవ్వలేదంటూ ఆయన చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పుడు ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు అన్నది సస్పెన్స్ గా మారింది.ఇప్పటికే రంగంలోకి దిగిన అధికార బారాస ,మాజీ మంత్రి కడియం శ్రీహరిని( Kadiam Srihari ) చర్చల కోసం పంపినట్టుగా తెలుస్తుంది.రాకేష్ రెడ్డి ఇంటికెళ్లిన కడియం శ్రీహరి తమ పార్టీలోకి చేరాల్సిందిగా ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది.
దానికి రాకేశ్ రెడ్డి కూడా ప్రాధమికం గా సంసిద్దత వ్యక్తం చేశారని, మరో రెండు రోజుల్లో తన నిర్ణయం ప్రకటిస్తానని తెలిపినట్లుగా తెలుస్తుంది.కాంగ్రెస్ ( Congress )అగ్ర నాయకత్వం కూడా రాకేష్ తో టచ్ లోకి వెళ్లిందని పార్టీలోకి ఆహ్వానించిందని తెలుస్తుంది.
అయితే స్వతంత్ర అబ్యర్ధిగా పోటీ చేయాలా లేక ఈ రెండు పార్టీల లో ఏదో ఒక పార్టీ తరపున పోటీ చేయాలా అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని రాకేశ్ రెడ్డి చెప్తున్నట్టుగా తెలుస్తుంది.నాయకత్వ లోపంతో తెలంగాణలో బిజెపి చచ్చిపోయిందని రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించడం తీవ్ర సంచలనంగా మారింది .ఇప్పటికే అనేకమంది సీనియర్లు బిజెపిని వీడి కాంగ్రెస్లోకి వెళ్లిపోవడంతో భాజపా ఖాళీ అయ్యే పరిస్తితి వచ్చింది .ఇతర పార్టీలలోంచి కీలక నాయకులను ఆకర్షిద్దామనుకున్న బిజెపికి రివర్స్లో తమ కీలక నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లిపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని సమాచారం.