ఎమోజీ అంటే ఏమిటో తెలియని యువత దాదాపు ఉండదనే చెప్పుకోవాలి.ఎమోజీలు అనేవి గొప్ప ఆవిష్కరణ అని చెప్పుకోవాలి.
ఎందుకంటే మనం ఎదుటివారికి చెప్పబోయే ఓ విషయాన్ని, ఓ ఎమోషన్ రూపంలో చాలా తేలికగా తెలియజెప్పడానికి తయారు చేయబడ్డ చిత్రాలవి.అందుకే ఇవి వివిధ సోషల్ మీడియాలలో టెక్స్ట్ చేసేటప్పుడు విరివిగా వాడబడతాయి.
దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలవారు వీటిని వాడుతున్నారని ఓ సర్వే.అయితే కొన్ని ఎమోజీల విషయంలో చాలా మంది భారతీయ వినియోగదారులు వాటి కచ్చితమైన వినియోగం విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారని తాజా సర్వే వెల్లడించింది.
ఈ సర్వేలో భాగంగా ఉత్తర అమెరికా, ఆసియా, యూరప్‌లోని 9,400 మంది DuoLingo అనే సర్వేలో పాల్గొన్నారు.ఆనందం, నవ్వు, దుఃఖాన్ని సూచించే ఎమోజీల విషయంలో ఎవరూ కన్ఫ్యూజ్ అవ్వడం లేదుగానీ కొన్ని రకాల ఎమోజిల విషయంలో కాస్త గందరగోళానికి గురవుతున్నారని తెలిసింది.
ముఖ్యంగా (?, ? , ?) ఈ మూడు ఎమోజీల విషయంలో 36% ఇండియన్ యూజర్స్ ఎక్కువగా గందరగోళానికి గురవుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.ఇక ? – ‘కళ్ళ’ ఎమోజీ విషయానికి వస్తే, దాదాపు 46% ‘నేను నిన్ను చూస్తున్నాను’ అని పేర్కొనగా, 27% మంది ‘నేను దీన్ని చూస్తున్నాను’ అని.మరో 10% ‘నాకు తెలుసు’ అని.ఇంకో 10% మంది ‘ఓహ్’ అని చెప్పేందుకు ఉపయోగిస్తున్నట్లు తేలింది.

ఇకపోతే ? – ఈ ఎమోజీని 52% మంది ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అనే విషయం తెలిపేందుకు వినియోగించగా, 27% మంది మాత్రం ‘ప్లాటోనిక్ లవ్’ చిహ్నంగా భావిస్తున్నారట.అలాగే ? – మనీ ఎమోజీని మాత్రం చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది.దీనిని 41% మంది ‘డబ్బు ప్రవాహాన్ని’ సూచించేందుకు ఉపయోగిస్తే, 40% ‘డబ్బు కోసం ఆశతో’ అనే అర్థంలో వినియోగిస్తున్నారట.ఆసక్తికరంగా, 14% మంది మాత్రం దీన్ని ‘డబ్బు నష్టం’కు చిహ్నంగా వాడుతున్నారని వినికిడి.
సాధారణంగా ఈ ఎమోజీకి అర్థం ‘డబ్బు పోగొట్టుకోవడం’ అనే అర్ధం వస్తుందట.