తెలంగాణ కాంగ్రెస్ కి మరో ఎదురు దెబ్బ! బీజేపీలో చేరిన డికె అరుణ

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెలంగాణలో కాంగెస్ పార్టీకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి.

టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి ఇప్పటికే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కారు ఎక్కడానికి రెడీ అయిపోయారు.

మరో వైపు పార్టీ సీనియర్ నేతలు కూడా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీని వీడే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ని వీడి టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు.

ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నాడు.ఇదిలా ఉంటె తాజా మరో మాజీ మంత్రి డీకే అరుణ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరిపోయారు.

ఆమె నిన్న సాయత్రం ఢిల్లీలో అమితా సమక్షంలో బీజేపీ పార్టీ తీర్ధం తీసుకున్నారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, తెలంగాణ అభివృద్ధి బీజేపీతో సాధ్యం అని భావించి మోడీ నాయకత్వంలో పని చేయడానికి సిద్ధమయ్యా అని చెప్పుకొచ్చారు.

Advertisement
కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?

తాజా వార్తలు