సిద్దు జొన్నలగడ్డ( Siddu jonnalagadda ) హిట్ పడ్డా కూడా తొందర పడటం లేదు.మెల్లగానే మంచి సినిమా లు చేద్దాం అన్నట్లుగా సాఫీగానే ఉన్నట్లుగా ఆయన పద్దతి చూస్తూ ఉంటే అనిపిస్తోంది.
ప్రస్తుతం డీజే టిల్లు( DJ Tillu ) సినిమాకు సీక్వెల్ అన్నట్లుగా టిల్లు స్వేర్ సినిమా ని చేస్తున్నాడు.వచ్చే ఏడాది ఫిబ్రవరి లో ఆ సినిమా ను విడుదల చేయబోతున్నాడు.
ఇక కొత్త సినిమా విషయం లో సిద్దు జొన్నలగడ్డ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు.కానీ గత కొన్నాళ్లుగా నందిని రెడ్డి దర్శకత్వం లో సిద్దు సినిమా రాబోతుంది.
అందులో సమంత కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వచ్చాయి.

రామ్ తాళ్లూరి ( Ram Talluri )నిర్మాణం లో సిద్దు హీరోగా సమంత ప్రధాన పాత్ర లో నందిని రెడ్డి( Nandini Reddy ) దర్శకత్వం లో సినిమా రాబోతుంది అంటూ మీడియా వర్గాలకు ఆఫ్ ది రికార్డ్ సమాచారం ఇవ్వడం జరిగింది.కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే ఆ సినిమా ఉందా లేదా అనే అనుమానాలు మొన్నటి వరకు వ్యక్తం అయ్యాయి.తాజాగా మాత్రం సిద్దు హీరోగా నందిని రెడ్డి సినిమా చేయబోతుంది.
అయితే నిర్మాణ సంస్థ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.రామ్ తాళ్లూరి నిర్మాతగా కాకుండా మరో నిర్మాత తో సినిమా ను చేసేందుకు నందిని రెడ్డి రెడీ అవుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు ఆ విషయమై కూడా క్లారిటీ లేదు.

ఎందుకు రామ్ తాళ్లూరి సినిమా నిర్మాణం నుంచి తప్పుకున్నాడు అనేది తెలియాల్సి ఉంది.ఆయన ఈ మధ్య కాలంలో కొత్త సినిమా లు చేపట్టలేదు.ఉన్న సినిమా ను కూడా వదిలేశాడు.
దాంతో ఆయన ఇతర వ్యాపారాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని భావిస్తున్నాడా అంటూ కొందరు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.మొత్తానికి సిద్దు జొన్నలగడ్డ మరియు నందిని రెడ్డి కాంబో సినిమా వస్తుంది కానీ, ఎప్పుడు వస్తుంది, ఎవరి నిర్మాణం లో వస్తుంది అనేది మాత్రం క్లారిటీ లేదు.