ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన దివ్యవాణి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.మూడు వరుస హిట్లు వచ్చిన తర్వాత ఇతర భాషల సినిమాలతో బిజీ అయ్యానని ఆమె కామెంట్లు చేశారు.
మా వారికి కూర్గ్ లో కాఫీ ప్లాంట్ ఉందని దివ్యవాణి చెప్పుకొచ్చారు.సినిమాలలో నటించవద్దని భర్త చెప్పలేదని పిల్లలపై దృష్టి పెట్టి నేనే సినిమాలకు దూరంగా ఉన్నానని ఆమె కామెంట్లు చేశారు.
మలయాళంలో మమ్ముట్టిగారితో ఒక సినిమా చేశానని దివ్యవాణి చెప్పుకొచ్చారు.పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారని దివ్యవాణి కామెంట్లు చేశారు.బాబు హెల్త్ విషయంలో అతను చాలా చాలా అప్సెట్ అయ్యాడని బాబులు బ్లాక్ మ్యాజిక్ చేయించారని కొంతమంది భావించారని దివ్య వాణి కామెంట్లు చేశారు.నేను అలాంటివి నమ్మేదనిని కాదని ఆమె చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత ఏసుక్రీస్తు చర్చికి తీసుకెళ్తానని చెప్పడం జరిగిందని దివ్యవాణి తెలిపారు./br>

ఆ తర్వాత నేను బైబిల్ చదవడం మొదలుపెట్టానని దివ్యవాణి చెప్పుకొచ్చారు.నేను క్రీస్తును నా స్వరక్షకుడిగా అంగీకరించానని ఆమె తెలిపారు.నేను హిందువునని ఆమె పేర్కొన్నారు.
క్రీస్తు ఉన్నది నిజమేనని నేను అబద్ధం చెప్పలేదని దివ్యవాణి అన్నారు.కొడుకు ఆరోగ్యం బాలేని సమయంలో చాలా బాధ పడ్డానని ఆమె పరోక్షంగా చెప్పుకొచ్చారు.
నాకొచ్చిన పని యాక్టింగ్ అని ఆమె తెలిపారు.

దేవుని పేరు చెప్పి డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం లేదని దివ్యవాణి కామెంట్లు చేశారు.ప్రస్తుతం బాబు ఆరోగ్యం బాగానే ఉందని ఆమె అన్నారు.మతం మారాలని ఎవరో చెప్పినంత మాత్రాన ఎవరూ మారారని దివ్యవాణి తెలిపారు.
దివ్యవాణి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దివ్యవాణి మళ్లీ సినిమా ఆఫర్లతో బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
దివ్యవాణి కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.
