టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ మూవీ ‘ఖుషి’.ఈ సినిమా కోసం ఇటు విజయ్ ఫ్యాన్స్ అటు సమంత ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
ఈ ఇద్దరు కూడా ఈ సినిమా హిట్ కోసం చూస్తున్నారు.ముఖ్యంగా విజయ్( Vijay Devarakonda, ) కు ఈ సినిమా హిట్ చాలా కీలకంగా మారింది.
లైగర్ వంటి ప్లాప్ చూసిన విజయ్ ఈ సినిమా ప్లాప్ ను మరిపించే విధంగా హిట్ అందుకోవాలని తహతహ లాడుతున్నారు.ఈ క్రమంలోనే శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
సమంత, విజయ్ కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమా షూట్ ఈ మధ్యనే స్టార్ట్ అయ్యింది.శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా భాగం కానుంది అని సెకండాఫ్ లో వచ్చే ఈ హీరోయిన్ పాత్రలో దివ్యాంశ కౌశిక్( Divyansha Kaushik ) నటించనుంది అని తాజా సమాచారం.దివ్యాంశ సమంత చెల్లెలి పాత్రలో నటిస్తుందని టాక్ రావడంతో ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది.అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన వస్తే కానీ నిజమెంతో తెలియదు.ఈమె పాత్ర ఉన్నది నిజం అయితే ఎలా ఈ పాత్రను డైరెక్టర్ టర్న్ చేస్తాడో చూడాలి.

శివ నిర్వాణ( Shiva Nirvana ) ఈ సినిమా కథ మెచ్యూర్డ్ లవ్ స్టోరీగా రాసుకుని తెరకెక్కిస్తున్నాడు.మరి ఈ సినిమా కూడా మరో నిన్ను కోరి, మజిలీ సినిమాల సరసన నిలిచి పోతుందో లేదో వేచి చూడాల్సిందే.ఇక ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతున్నట్టు ఈ మధ్యనే ప్రకటించారు.కాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తుండగా.మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్నారు.
