హైదరాబాద్; దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.మంగళవారం ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఆలింకో) ఆధ్వర్యంలో అమీర్ పెట్ గురుగోవింద్ స్టేడియంలో ఏర్పాటుచేసిన దివ్యాంగులకు అవసరమైన కిట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దివ్యాంగుల పట్ల కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉంది అని అన్నారు.దీనిలో భాగంగా దివ్యాంగులకు మూడు శాతం ఉన్న రిజర్వేషన్ నాలుగు శాతానికి పెంచామని అన్నారు.
అలాగే దివ్యాంగుల ను కించపరిచే విధంగా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తప్పవని దీనికోసం ప్రత్యేక చట్టాలను తీసుకు వచ్చామని తెలిపారు.ఒక కోటి 54 లక్షల రూపాయల ఖర్చుతో దివ్యాంగులకు అవసరమైన 1400 రకాల వస్తువులు బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్, హియరింగ్ మిషన్స్, కృత్రిమ కాలు, కృత్రిమ చేయి లను అందించారు.
దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి పరికరం కావాలన్నా తమకు తెలియజేస్తే వారికి అందేలా చూస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్, అమీర్పేట్ కార్పొరేటర్ సరళ, జిహెచ్ఎంసి ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికుమార్,అలంకో అధికారులు బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.