Divya Bharati: దివ్యభారతి అనుమానాస్పద మృతి పై సినిమా.. హీరో అతనే?

ఒకప్పటి దివంగత హీరోయిన్ దివ్యభారతి( Divya Bharati ) గురించి ఈతరం ప్రేక్షకులకు అంతగా తెలియక పోయినప్పటికీ ఆ తరం ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేస్తారు.అప్పట్లో ఎన్నో సినిమాలలో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకున్న దివ్య భారతి కెరీర్ను ఎవరు ఊహించని విధంగా అర్ధాంతరంగా ముగిసిపోయింది.

 Divya Bharti Movie Pre Look Poster Released By Talasani Srinivas Yadav-TeluguStop.com

అయితే అప్పట్లో ఆమె మృతిపై ఎన్నో విషయాలు బయటకొచ్చినప్పటికీ ఆ మిస్టరీ ఇప్పటికీ అనుమానాస్పదమే.అయితే ఆ కథను ఇప్పుడు తెరపై ఆవిష్కరించే ప్లాన్ చేశారు.

Telugu Amala, Divya Bharati, Divya Bharti, Ketan Srivastav, Pre Poster, Veterana

వివి వెంచర్స్ పతాకంపై కేతన్ శ్రీవాస్ధవ్( Ketan Srivastav ) హీరోగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా దివ్య భారతి సినిమా( Divya Bharati Movie ) తెరకెక్కిస్తున్నారు.అనుమానాస్పద మృతి అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ చిత్ర పోస్టర్ ని ప్రముఖ సినిమాటోగ్రఫి మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్( Talasani Srinivas Yadav ) రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పూర్ణిమ మాట్లాడుతూ.మా చిత్ర పోస్టర్‌ని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేయడం ఎంతో ఆనందంగా చేయటం ఎంతో ఆనందంగా ఉంది.

దివ్యభారతి గత స్మృతులను గుర్తు చేసుకుంటూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము.అప్పటి పరిణామాలను, దివ్య భారతి జీవితంలో జరిగిన సంఘటనలను కళ్ళకు కట్టినట్టు ఈ చిత్రంలో చూపించబోతున్నాము.

Telugu Amala, Divya Bharati, Divya Bharti, Ketan Srivastav, Pre Poster, Veterana

ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాము అని తెలిపారు.ఆగస్టు మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించుకొని సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తి చేయనున్నారు.ఈ చిత్రంలో పాత, కొత్త నటీనటుల కాంబినేషన్ ఉంటుంది.ఈ చిత్రంలోఒక ప్రముఖ నటి కీ రోల్ పోషించనుందట.కాగా కేతన్ శ్రీవాస్ధవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా అమల వ్యవహరిస్తుండగా.శ్యామ్ డల్లి సంగీతం అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube