Divya Bharati: దివ్యభారతి అనుమానాస్పద మృతి పై సినిమా.. హీరో అతనే?

ఒకప్పటి దివంగత హీరోయిన్ దివ్యభారతి( Divya Bharati ) గురించి ఈతరం ప్రేక్షకులకు అంతగా తెలియక పోయినప్పటికీ ఆ తరం ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేస్తారు.

అప్పట్లో ఎన్నో సినిమాలలో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకున్న దివ్య భారతి కెరీర్ను ఎవరు ఊహించని విధంగా అర్ధాంతరంగా ముగిసిపోయింది.

అయితే అప్పట్లో ఆమె మృతిపై ఎన్నో విషయాలు బయటకొచ్చినప్పటికీ ఆ మిస్టరీ ఇప్పటికీ అనుమానాస్పదమే.

అయితే ఆ కథను ఇప్పుడు తెరపై ఆవిష్కరించే ప్లాన్ చేశారు. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/07/ya-bharti-movie-pre-look-poster-released-by-talasani-srinivas-yadav-detailsa!--jpg" / వివి వెంచర్స్ పతాకంపై కేతన్ శ్రీవాస్ధవ్( Ketan Srivastav ) హీరోగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా దివ్య భారతి సినిమా( Divya Bharati Movie ) తెరకెక్కిస్తున్నారు.

అనుమానాస్పద మృతి అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ చిత్ర పోస్టర్ ని ప్రముఖ సినిమాటోగ్రఫి మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్( Talasani Srinivas Yadav ) రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పూర్ణిమ మాట్లాడుతూ.మా చిత్ర పోస్టర్‌ని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేయడం ఎంతో ఆనందంగా చేయటం ఎంతో ఆనందంగా ఉంది.

దివ్యభారతి గత స్మృతులను గుర్తు చేసుకుంటూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము.అప్పటి పరిణామాలను, దివ్య భారతి జీవితంలో జరిగిన సంఘటనలను కళ్ళకు కట్టినట్టు ఈ చిత్రంలో చూపించబోతున్నాము.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/07/ya-bharti-movie-pre-look-poster-released-by-talasani-srinivas-yadav-detailsd!--jpg" / ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాము అని తెలిపారు.

ఆగస్టు మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించుకొని సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తి చేయనున్నారు.

ఈ చిత్రంలో పాత, కొత్త నటీనటుల కాంబినేషన్ ఉంటుంది.ఈ చిత్రంలోఒక ప్రముఖ నటి కీ రోల్ పోషించనుందట.

కాగా కేతన్ శ్రీవాస్ధవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా అమల వ్యవహరిస్తుండగా.

శ్యామ్ డల్లి సంగీతం అందిస్తున్నారు.

డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో కోవిడ్ కలకలం.. పలువురికి పాజిటివ్‌