మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చిన దివి ప్రూవ్ చేసుకోలేకపోయిందా? అంత ఏం లేదంటూ?

డైరెక్టర్ మోహన్ రాజా, చిరంజీవి కాంబినేషన్ లో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా గాడ్ ఫాదర్. పొలిటికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నయనతార, బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు.

 Divi Did Not Act As Fans Expectation In God Father Movie Details, Megastar Chira-TeluguStop.com

ఇక సత్యదేవ్ కంచరాన, గద్దర్, గంగవ్వ, అనసూయ, ఇంద్రజిత్ సుకుమారన్ తదితరులు నటించారు.అంతేకాకుండా ఇందులో మరో బ్యూటీ దివి కూడా నటించిన సంగతి తెలిసిందే.

కానీ ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోలేకపోయింది.

 Divi Did Not Act As Fans Expectation In God Father Movie Details, Megastar Chira-TeluguStop.com

అయితే ఇందులో అందరి నటన బాగున్నప్పటికీ దివి నటన మాత్రం బాగా లేదని టాపిక్ నడుస్తుంది.

ఇంతకూ అసలు విషయం ఏంటంటే.బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి తెలుగు ప్రేక్షకులకలందరికి పరిచయమే.

బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొని తన అందంతో యువత మనసులు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.

అలా ఈ షోతోనే ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

బిగ్ బాస్ తర్వాత వెండితెరపై అంతంతగా మాత్రమే అవకాశాలు అందుకుంది.పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి సక్సెస్ అందుకుంది.

సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.బిగ్ బాస్ ముందు వెండితెరపై సైడ్ ఆర్టిస్టుగా నటించింది.

కానీ బిగ్ బాస్ లో అడుగుపెట్టాక ఓ సెలబ్రిటీగా మారింది.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం తన గేమ్ తో, మాటలతో అందర్నీ ఫిదా చేసింది.తన అందంతో మాత్రం అందర్నీ చూపు తిప్పుకోకుండా చేసింది.పైగా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా కూడా నిలిచి అందరి దృష్టిలో పడింది.గతంలో ఈమెకు టాలీవుడ్ సినీ దర్శక నిర్మాతలు పలు అవకాశాలు కూడా ఇచ్చారు.

ఇక ఓ ప్రైవేట్ స్పెషల్ సాంగ్ లో చేయగా తన డాన్స్ స్టెప్పులతో బాగా ఆకట్టుకుంది.

ఇక ఇప్పుడు అవకాశాలు అందుకోవడం లేదు.ఇక మొదట్లో ట్రెడిషనల్ గా కనిపించిన ఈ బ్యూటీ ఈ మధ్య తన గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.

పొట్టి పొట్టి బట్టలతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ తో దర్శనమిస్తూ తన అందం తో మతి పోగొడుతుంది.

సోషల్ మీడియాలో కూడా ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తన అభిమానులతో తెగ ముచ్చట్లు కూడా పెడుతుంది.వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.తన డాన్స్ వీడియోలతో, ఫన్నీ రీల్స్ తో బాగా హడావుడి చేస్తుంది.ఇక తన కుటుంబ సభ్యుల ఫోటోలను, తన ప్రాజెక్టు కు సంబంధించిన అప్డేట్లను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంది.నిజానికి ఈ ముద్దు గుమ్మ బిగ్ బాస్ తర్వాత వరుస హిట్లతో బాగా దూసుకెళ్లింది.

ఇక గతంలో ఈమెకు బిగ్ బాస్ ఫైనల్ రోజు చిరంజీవి చీఫ్ గెస్ట్ గా పాల్గొని దివికి తన సినిమాలో అవకాశం ఇస్తా అన్నానని అనగా అన్నట్టుగానే గాడ్ ఫాదర్ లో తనకు అవకాశం ఇచ్చాడు.ఇక ఆ సినిమాలో దివి ఒక అనాధ.

తర్వాత సునీల్ ని పెళ్లి చేసుకుంటుంది.అయితే ఈమె ఆ పాత్రలో నటించినప్పటికీ కూడా ఎందుకో తన నటనతో ప్రూవ్ చేసుకోలేకపోయింది అని.తన నటన అంత అద్భుతంగా లేదు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.ఇంత పెద్ద స్టార్ హీరో సినిమాలనే మెప్పించలేకపోయిన దివికి మళ్లీ అవకాశాలు వస్తాయో రావో అని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

Video : Divi Did Not Act As Fans Expectation In God Father Movie Details, Megastar Chiranjeevi, Divi Vsdthya, God Father, Bigg Boss Season 4, Tollywood, Bigg Boss Divi, Divi Acting, Divi God Father Movie, Divi, #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube