జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలు ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా : క్రీడలతో స్నేహ సంబంధాలు పెంపొందుతాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.

సీఎం కప్ పోటీల్లో భాగంగా ఇటీవల గ్రామస్థాయి, మండల స్థాయి ఆటలు ఇటీవల నిర్వహించగా, బుధవారం జిల్లా స్థాయి పోటీల కార్యక్రమాన్ని కలెక్టర్, ఎస్పీ కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.

అనంతరం వాలీ బాల్ కలెక్టర్, ఎస్పీ ఆడి క్రీడాకారులను ఉత్తేజ పరిచారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకు వచ్చి, వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించేలా తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు.ఇక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప రెడ్డి, జిల్లా యువజన అండ్ స్పోర్ట్స్ అధికారి రాందాస్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ లావణ్య ఎస్ .ఎఫ్ సెక్రటరీ మరియు ప్రభుత్వ ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది .

నిర్దేశిత సమయంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Advertisement

Latest Rajanna Sircilla News