శిక్షణ కేంద్రాలను, పోస్టల్ బ్యాలెట్ ఫెలిసిటేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ కోసం ఉద్దేశించిన కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanti ) సోమవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం కు సంబంధించి అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయగా, సిరిసిల్ల నియోజకవర్గం సంబంధించి సిరిసిల్ల పట్టణంలోని గీతా నగర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఈ నెల 21,22 తేదీలలో రెండు నియోజకర్గాల కు సంబంధించి పోలింగ్ విధుల్లో పాల్గొనే పి ఓ ,ఏపీ ఓ ,ఓపి ఓ లకు శిక్షణ ఇవ్వనున్నారు.రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఫారం-12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకునీ ఎన్నికల పోలింగ్ శిక్షణ కు వచ్చే పిఓ ,ఏపీఓ ,ఓపిఓ సిబ్బందికి అక్కడే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫెలిసిటేషన్ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోనేలా చేసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఎన్నికల సంఘం( Election Commission ) నిబంధనలను అనుసరిస్తూ రహస్య ఓటింగ్ కు భంగం వాటిల్లకుండా పోస్టల్ బ్యాలెట్ ఫెలిసిటేషన్ ( Postal Ballot Congratulation )కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.క్షేత్ర పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట రిటర్నింగ్ అధికారులు ఆనంద్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి గంగయ్య,పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి లక్ష్మి రాజం,శిక్షణ కార్యక్రమాల నోడల్ అధికారి పిబి శ్రీనివాస్ చారి, తహశీల్దార్ లు షరీఫ్, మహేష్ తదితరులు ఉన్నారు.

మిస్సింగ్ అయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన వేములవాడ టౌన్ పోలీసులు.....
Advertisement

Latest Telugu Directors News