నామాపూర్ లోని తెలంగాణ ఆదర్శ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

కంప్యూటర్ శిక్షణ ఎలా ఉంది పాఠశాలలో అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయా.కంప్యూటర్ ప్రాక్టికల్ తరగతులు నిర్వహించడంపై ప్రత్యేక దృష్టి సారించాలి నామాపూర్ లోని తెలంగాణ ఆదర్శ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి దర్యాప్తు న్యూస్ సిరిసిల్ల ఆగస్టు 30:మీ పాఠశాలలో కంప్యూటర్ శిక్షణ ఎలా ఉంది.

ప్రాక్టికల్ తరగతులు నిర్వహించి సరైన విధంగా నేర్పిస్తున్నారా.

అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయా అనే విషయాలను విద్యార్థులను అడిగి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలుసుకున్నారు.బుధవారం ముస్తాబాద్ మండలం నామాపూర్ లో గల తెలంగాణ ఆదర్శ పాఠశాలను జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు.

ముందుగా ప్రిన్సిపాల్ ను అడిగి పాఠశాలలో మొత్తం ఎంత మంది విద్యార్థులు ఉన్నారు, భోజనం మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలో మొత్తం 670 మంది విద్యార్థులు ఎన్ రోల్ మెంట్ అయ్యారని ప్రిన్సిపాల్ కలెక్టర్ కు వివరించారు.

గత సంవత్సరం వచ్చిన ఫలితాలపై ఆరా తీసిన కలెక్టర్, ఈ సంవత్సరం పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు బోధించాలని ఆదేశించారు.విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.

Advertisement

కంప్యూటర్ చాంప్స్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కంప్యూటర్ తరగతులు నిర్వహిస్తున్న తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఇప్పటివరకు ఏమేం నేర్చుకున్నారు అనే వివరాలను విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

మీరు ఏమేం నేర్చుకున్నారో ప్రాక్టికల్ గా నాకు చూపించండి అని కలెక్టర్ అడగగా, విద్యార్థులు తాము ఇప్పటివరకు నేర్చుకున్న విషయాల గురించి ప్రాక్టికల్ గా చేసి చూపించారు.బాగా చేస్తున్నారు.

మరింత నేర్చుకోండి అంటూ కలెక్టర్ విద్యార్థులను అభినందించారు.సరైన వసతులు ఉన్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

మధ్యాహ్న భోజనంలో భాగంగా మెనూ గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, రాగి జావ క్రమం తప్పకుండా అందించాలని అన్నారు.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

వసతి గృహంలో ఎంత మంది విద్యార్థులు ఉంటున్నారని కలెక్టర్ ఆరా తీశారు.మెరుగైన వసతులు కల్పించాలని, మరమ్మత్తులు ఏమైనా ఉంటే సరిచేయించాలని అన్నారు.

Advertisement

వసతి గృహంలో ఉన్న విద్యార్థులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే వివరాలను ఏఎన్ఎం ను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులందరూ ఆరోగ్యంగానే ఉన్నారని, సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయని ఏఎన్ఎం కలెక్టర్ కు వివరించారు.

తనిఖీలో కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, అడిషనల్ డీఆర్డీఓ మదన్ మోహన్, తహశీల్దార్ గణేష్, తదితరులు ఉన్నారు.సంస్థాగత ప్రసవాలను పెంపొందించేలా కృషి చేయాలి.

పోత్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమీక్ష నిర్వహించిన కలెక్టర్రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంస్థాగత ప్రసవాలు పెంచే విధంగా ఏఎన్ఎం లు కృషి చేయాలని, ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న అత్యాధునిక సేవలపై అవగాహన కల్పించి నమ్మకం పెంచాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య 71 శాతం ఉందని, మిషన్ 80 లో భాగంగా లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ సూచించారు.

సాధారణ ప్రసవాలతో కలిగే దీర్ఘకాలిక లాభాల పట్ల అవగాహన కల్పిస్తూ సిజేరియన్లకు కట్టడి వేయాలన్నారు.గత నెలలో చీకోడ్, అవునూర్ ఆరోగ్య ఉప కేంద్రాల్లో ప్రభుత్వ ప్రసవాల శాతం తక్కువగా ఉందని, వచ్చే నెల నుండి ఈ శాతం పెంచేలా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

అంతకముందు కలెక్టర్ పోత్గల్ గ్రామంలోని ప్రధాన రహదారి మధ్యలో చేపడుతున్న ప్లాంటేషన్ పనులను పరిశీలించారు.స్వయంగా మొక్క నాటారు.నాటిన అన్ని మొక్కలను క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని పంచాయితీ కార్యదర్శికి సూచించారు.

సమీక్షలో జిల్లా వైద్యాధికారి డా.సుమన్ మోహన్ రావు, ఉప వైద్యాధికారులు డా.శ్రీరాములు, డా.రజిత, తదితరులు ఉన్నారు.

Latest Rajanna Sircilla News