విశాఖ జిల్లా టీడీపీలో అసంతృప్త జ్వాల చెలరేగింది.ఈ క్రమంలోనే విశాఖ సౌత్ నియోజకవర్గ ఇంఛార్జ్ గండి బాబ్జి( Gandi Babji ) టీడీపీకి రాజీనామా చేశారని తెలుస్తోంది.
పొత్తుల్లో భాగంగా విశాఖ సౌత్ నియోజకవర్గ టికెట్ ను జనసేన పార్టీకి కేటాయించడంతో గండి బాబ్జి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.ఈ క్రమంలోనే ఆయన పార్టీని వీడారని సమాచారం.
అయితే కొన్ని రోజుల క్రితమే మరో నేత పాసర్ల ప్రసాద్( Pasarla Prasad ) కూడా టీడీపీకి రాజీనామా చేశారన్న సంగతి తెలిసిందే.

కాగా ఈయన విశాఖ వెస్ట్ స్థానాన్ని ఆశించి భంగపడ్డారు.అదేవిధంగా యలమంచిలి సీటును విజయ్ కు కేటాయించడంతో నాగేశ్వర రావు కినుక వహిస్తుండగా పెందుర్తి సీటు( Pendurthi Seat ) పంచకర్లకు కేటాయించారన్న వార్తల నేపథ్యంలో బండారు వర్గీయులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దాంతో పాటు పాడేరు సీటు బీజేపీకి కేటాయించారన్న వదంతులతో టీడీపీ శ్రేణులు నిరసనలకు సిద్ధం అయ్యారు.







