యాదాద్రి భువనగిరి జిల్లా:ప్రపంచ చరిత్రలో ఏ నియంత కూడా శాశ్వతంగా అధికారంలో లేడని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ అన్నారు.ఏఐసిసి మరియు టిపీసీసీ పిలుపు మేరకు శనివారం తుర్కపల్లి మండల కేంద్రంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల రిబ్బండ్లతో మోదీ బొమ్మను అంబేద్కర్ కాల్ల వద్ద ఉంచి నిరసన తెలిపారు.
అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదానీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే రాహుల్ పై వేటు వేశారని ఆరోపించారు.
దేశంలో అప్రకటిత ఏమర్జెన్సీ ఉందని,మధ్యయుగం చక్రవర్తిలా మోడీ వ్యవహరిస్తున్నాడని,కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ పై కోర్ట్ కు వెల్లేందుకు అప్పిల్ చేసేందుకు 30 రోజుల సమయం ఇచ్చారని, అయినా అనర్హత వేటు వేయడం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని మండిపడ్డారు.
జోడో యాత్రలో బీజేపీ వైఫల్యాలను రాహుల్ గాంధీ ఎండగట్టి ప్రజల ముందు ఉంచారని,జోడో యాత్రకు బీజేపీ భయపడిందన్నారు.
దేశం రాహుల్ గాంధీకి అండగా ఉంటుందని,ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని కొనసాగించాలని లేని పక్షంలో దేశ వ్యాప్తంగా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.స్థానికపోలీస్ స్టేషన్లో ప్రధాని మోదీపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సేవాదల్ అధ్యక్షుడు తలారి అశోక్, మండల కాంగ్రెస్ నాయకులు కోట సురేష్, ఓర్సు భిక్షపతి,బండారి శ్రీను,భూక్యా రమేష్ నాయక్ తదితర కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.