Hot Star – Walt Disney : రిలయెన్స్ ధాటికి తట్టుకోలేక తట్టాబుట్టా సర్దుకుంటున్న హాట్ స్టార్ – వాల్ట్ డిస్నీ?

హాట్ స్టార్ - వాల్ట్ డిస్నీ( Hot Star - Walt Disney ) గురించి ప్రపంచ జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

ఓటీటీ, పలు భాషల్లో సినిమాల రిలీజ్, వెబ్ సిరీస్, వీడియో ఆన్ డిమాండ్ విషయంలో ఎంటర్టైన్మెంట్ రంగంలో దూసుకుపోతున్న ఈ జాయింట్ వెంచర్ ఇపుడు మరో భాగస్వామి కోసం వెతుకుతున్నట్టు తెలుస్తోంది.

అసలు మంచి పార్టీ దొరికితే వీలయితే అమ్మేయాలని కూడా అనుకుంటోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కధనాన్ని ప్రచురించింది.

దీని ప్రకారం.ఈ ప్రయత్నాలు ఇంకా మొదటి దశలోనే ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ జాయింట్ వెంచర్ కూడా రిలయెన్స్ ( Reliance )నుంచి పోటీని తట్టుకోలేక తట్టాబుట్టా సర్దుకునే ప్రయత్నం చేస్తోందని గుసగుసలు వినబడుతున్నాయి.

Advertisement

లేదంటే ఆదానీ గ్రూప్( Adani Group ) వంటి పార్టనర్ గాని దొరికితే నిలదొక్కుకుంటామని ఆశపడుతోంది.ఈ మధ్య జరిగిన ఐపీఎల్ డిజిటల్ మీడియా హక్కులను రిలయెన్స్ గెలుచుకున్నాక హాట్ స్టార్ బలమైన పోటీ విషయంలో కాస్త తడబడిందని సుస్పష్టం అవుతోంది.రిలయెన్స్ తన స్ట్రీమింగ్ సర్వీస్ జియో సినిమా( Jio movie ) పరిధిని విస్తరించడానికి వార్నర్ బ్రదర్స్ ప్రోగ్రామ్స్ కోసం సంప్రదింపులు జరుపుతున్నట్టు వినికిడి.

కాగా వార్నర్ బ్రదర్స్ ( Warner Bros )కి డిస్కవరీతో దీర్ఘకాల ఒప్పందం కుదిరింది.దాంతో రిలయెన్స్ తన విస్తరణ ప్రణాళికల్ని జాగ్రత్తగా రచిస్తున్నట్టు తెలుస్తోంది.మరోవైపు వాల్ట్ డిస్నీ ఆర్థిక స్థితి అంతంత మాత్రమే.

కాబట్టి ఈ కంపెనీలో వేల ఉద్యోగాలను తొలగించే పనిలో పడింది.

వార్షిక వ్యయం కోతలో భాగంగా కనీసం 7000 మందిని ఇంటికి పంపనుందని భోగట్టా.ఫిబ్రవరిలో స్వయంగా ఈ కంపెనీయే ఈ విషయం వెల్లడించింది.ఏప్రిల్లో మొదటి రౌండ్ తొలగింపుల్లో భాగంగా వేల మందికి పింక్ స్లిప్పులు అందించింది.

శోభన్ బాబు కలర్ గురించి జయలలిత తల్లి అలా అన్నారా.. అసలేం జరిగిందంటే?
ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో మరొకరు లేరా..? ఆయనకి ఎందుకంత క్రేజ్...

ఈ క్రమంలో సిబ్బందికి ఏడాది తొలగింపుల ప్యాకేజీ ఇవ్వనుంది.వెంటనే తీసేస్తే ఉద్యోగులు ఇబ్బందులు పడతారు కాబట్టి 6 నెలలు కొలువులో కొనసాగించడానికి ఓ ఏజెన్సీని కూడా.

Advertisement

నియమించడం జరిగింది.ఇదంతా వినోదరంగంలో నెలకొన్న పోటీని, తద్వారా దిగజారుతున్న ఆర్థిక స్థితిగతులను తెలియచేస్తోంది.

డిస్నీ- హాటా స్టార్ పరిస్థితే ఇలా ఉంటే ఇక మామూలు వినోద సంస్థల పరిస్థితిని ఏమిటన్న ప్రశ్నలు ఇపుడు మొదలయ్యాయి.

తాజా వార్తలు