బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ( Kuna Srisailam Goud )తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తోంది.రానున్న లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని కూన ఆశిస్తున్నారని తెలుస్తోంది.
అయితే నిన్న మల్కాజ్ గిరి సీటు తనకేనంటూ ఈటల రాజేందర్( Etela Rajender ) బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన కూన శ్రీశైలం గౌడ్ తన అనుచరులతో కీలక భేటీ నిర్వహించారని సమాచారం. మల్కాజ్ గిరి పార్లమెంట్( Malkajgiri ) నియోజకవర్గ టికెట్ రాకపోతే ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై ఆయన చర్చిస్తున్నారని తెలుస్తోంది.