విరాట్ కోహ్లీ ఆట తీరుపై సోషల్ మీడియాలో చర్చ.. టెస్టుల్లో విఫలం అంటూ..!

విరాట్ కోహ్లీ అంటే ఏ ఫార్మాట్లో అయినా వీర బాదుడు బాదుతాడు అనే రికార్డ్ ఉంది.కోహ్లీ దిగాడు అంటే సెంచరీ లేదా ఆఫ్ సెంచరీ చేశాకే వెను తిరుగుతాడు అనే సందర్భాలు చాలానే ఉన్నాయి.

 Discussion On Virat Kohli's Style Of Play On Social Media.. Failing In Tests, Vi-TeluguStop.com

ఇక క్రీజులో ఉంటే టీం గెలిచినట్టే.ఇదంతా ఒకప్పటి మాట.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆటతీరు ఇలాగే ఉంటే భవిష్యత్తు టెస్ట్ మ్యాచ్ లలో స్థానం ఉంటుందో, ఉండదో చెప్పలేని పరిస్థితిలో విరాట్ కోహ్లీ ఉండడం ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేసింది.కొంతకాలంగా ఏ ఫార్మాట్ లో కూడా కోహ్లీ మంచి పరుగులు చేయలేకపోవడంతో పాటు చివరకు క్రీజులో నిలబడడానికే చాలా తంటాలు పడుతున్నాడు.

ఇండోర్ టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రాణించలేకపోయాడు.తొలి ఇన్నింగ్స్ లో 22 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 13 పరుగులు చేశాడు.గతంలో ఆస్ట్రేలియాలో ఆడటంపై మంచి రికార్డ్ ఉన్న కోహ్లీ ఈ సిరీస్ లో మాత్రం రాణించలేకపోతున్నాడు.

ఈ సిరీస్ తొలి టెస్ట్ లో కేవలం 12 పరుగులు చేసి వెనుతిరిగాడు.ఇక ఢిల్లీ టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో 44 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 20 పరుగులు చేశాడు.2022 సౌత్ ఆఫ్రికా- ఇండియా మూడవ టెస్టులో విరాట్ కోహ్లీ ఆఫ్ సెంచరీ (79) చేశాడు.శ్రీలంక, ఇండియా టూర్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లలో (45, 23, 13) పరుగులు చేశాడు.ఇక ఇంగ్లాండ్ తో జరిగిన బర్మింగ్ హమ్ టెస్ట్ లో (20, 11) పరుగులు చేశాడు.

బంగ్లాదేశ్ సిరీస్ లో (1, 19, 24, 1) పరుగులు చేశాడు.

విరాట్ కోహ్లీ టెస్టులలో సెంచరీ చేసి మూడేళ్లు, ఆఫ్ సెంచరీ చేసి ఒక ఏడాది దాటింది.సెంచరీ, ఆఫ్ సెంచరీ ల విషయం పక్కన పెడితే కనీసం క్రీజు లో కూడా నిలబడలేక పోతున్నాడు.సోషల్ మీడియా వేదికగా విరాట్ కోహ్లీ ఆట తీరుపై చర్చ నడుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube