ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చేసుకుంటున్నాయి.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో సీట్ల కేటాయింపు, పొత్తులు, సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై అన్ని పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి.
అధికార పార్టీ వైసిపి( YCP ) ఒంటరిగా ఎన్నికలకు వెళ్తుండగా, టిడిపి ,జనసేన కూటమిగా వెళుతున్నాయి.అలాగే జనసేన ,బిజెపి ఇప్పటికే పొత్తు కొనసాగిస్తున్నాయి .టిడిపి జనసేన బిజెపి ఒక కూటమిగా ఎన్నికలకు వెళ్తే తిరుగు ఉండదని, తప్పకుండా అధికారంలోకి వస్తామనే నమకంతో టిడిపి అధినేత చంద్రబాబు ఉన్నారు.అందుకే గత కొంతకాలంగా బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర బీజేపీ పెద్దలు సానుకూలంగా స్పందించకపోవడంతో, చంద్రబాబు( Chandrababu naidu ) సైలెంట్ అయిపోయారు .అయితే టిడిపి తో పొత్తు పెట్టుకునే దిశగా బిజెపి సంకేతాలు ఇవ్వడంతో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు.

నిన్న రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) తో భేటీ అయ్యి తాజా రాజకీయ పరిణామాల పైన , టిడిపి ,బిజెపి, జనసేన పొత్తు, సీట్ల పంపకాలు వంటి అన్ని విషయాల పైన ప్రధానంగా చర్చించినట్లుగా వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు( Raghu Rama Krishna Raju ) ప్రకటించారు.2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ , బీజేపీలు కలిసి పోటీ చేయగా, జనసేన ఈ రెండు పార్టీలకు మద్దతు ఇచ్చింది.ఆ ఎన్నికల్లో బిజెపి , టిడిపి కూటమి గెలిచి అధికారంలోకి రావడంతో , ఇప్పుడు మళ్లీ పొత్తు పెట్టుకుంటే తప్పకుండా అధికారంలోకి వస్తామని అమిత్ షా తో చంద్రబాబు చెప్పినట్లు సమాచారం .

ఇక ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సైతం ఢిల్లీకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది.పవన్ తోనూ చర్చించి ఢిల్లీ నుంచి చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి.పొత్తులో భాగంగా బిజెపి కోరినన్ని సీట్లు ఇచ్చైనా సరే పొత్తు ఖరారు చేసుకుని ఏపీలో అధికారంలోకి రావాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారట.