ట్రైలర్‌ టాక్‌ : వర్మ బూతు కంటే ‘డర్టీ హరి’ దారుణంగా ఉంది

రామ్‌ గోపాల్‌ వర్మ ఈమద్య కాలంలో వరుసగా బూతు చిత్రాలు చేస్తున్నాడు.ఆయన చేస్తున్న సినిమాల్లో కంటెంట్‌ కంటే కూడా అధికంగా బూతు ఉంటుంది.

వర్మ ను ఆదర్శంగా తీసుకున్నాడో ఏమో కాని ప్రముఖ నిర్మాత ఎంఎస్‌ రాజు ‘డర్టీ హరి’ చిత్రాన్ని అంతకు మించిన బూతు చిత్రంగా రూపొందిస్తున్నాడు.యూత్‌ ఆడియన్స్‌ను టార్గెట్‌గా చేసి ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించినట్లుగా ఈజీగా అర్థం అవుతోంది.

ఆయన ఈ చిత్రంను పచ్చి బూతు కంటెంట్‌తో రూపొందించాడని ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తోంది.త్వరలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డర్టీ హరి చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఆ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసిన రాజు ట్రైలర్‌ను విడుదల చేసి చిత్రంపై అంచనాలు పెంచాడు.డర్టీ హరి చిత్రంలో హీరో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో అఫైర్‌ పెట్టుకోవడంతో పాటు వారితో శారీరకంగా కూడా కలవడం చేస్తున్నాడు.

Advertisement

ఈ ట్రైలర్‌కు సునీల్‌ వాయిస్‌ ఓవర్‌ చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకొవచ్చు.ఓటీటీ ప్రేక్షకులకు ఇలాంటి కంటెంట్‌ కావాలి.

ఖచ్చితంగా ఈ సినిమా మళ్లీ రచ్చ రచ్చగా స్ట్రీమింగ్‌ అవ్వడం అంటున్నారు.థియేటర్లలో ఇలాంటి సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపించని జనాలు ఈ సినిమాను ఓటీటీలో మాత్రం ఇరగబడి చూస్తారనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

అందుకే ప్రముఖ ఓటీటీలు ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డాయి.పెట్టిన పెట్టుబడిని మించి ఈ సినిమాకు ఇచ్చేందుకు ఓటీటీ వారు ముందుకు వచ్చారు.

త్వరలో విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు