సినిమా ఇండస్ట్రీ లో డైరెక్టర్లు( Directors ) నటులు గా మారడం చాలా సాధారణంగా జరుగుతూనే ఉంటాయి.అలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఒకసారి మనం తెలుసుకుందాం… మొదట కె విశ్వనాధ్( K Viswanath ) గారి గురించి చూసుకుంటే ఆయన అప్పట్లో డైరెక్షన్ చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీ లో మంచి విజయాలను అందుకున్నాయి.
ఇక ఆ తర్వాత అయన నటుడుగా మారి నటుడుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆయన చేసిన సినిమాల్లో ఆయనకి బాగా పేరు తీసుకువచ్చిన సినిమాలు ఏంటంటే కలిసుందాం రా, సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్, ఆడవారి మాటలకి అర్థాలే వేరులే లాంటి సినిమాలతో నటుడిగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు…

ఇక ఈయన తర్వాత చెప్పుకోవాల్సిన వాళ్లలో దేవి ప్రసాద్( Devi Prasad ) ఒకరు.ఈయన ఆడుతూ పాడుతూ, బ్లెడ్ బాబ్జి, కెవ్వు కేక లాంటి సినిమాలతో డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు…ఇక వీటిలో కొన్ని సినిమాలు ప్లాప్ అవ్వడం తో తాను నటుడిగా మారాల్సి వచ్చింది.ఆయన నటుడు గా చేసిన సినిమాల్లో నీది నాది ఒకే కథ లాంటి సినిమాతో మిడిల్ క్లాస్ ఫాదర్ ఎలా ఉంటాడో అలానే నటించి మెప్పించాడు…ఇక మొత్తానికి ఈ సినిమా మంచి విజయం సాధించింది దీనితో ఈయన ఇప్పుడు తెలుగులో మంచి నటుడి గా పేరు సంపాదించుకున్నాడు.వరుసగా సినిమాలు కూడా చేస్తున్నాడు…

ఇక వీళ్ల తర్వాత చెప్పుకునే మరో నటుడు కాశీ విశ్వనాథం…( Kasi Viswanatham ) ఈయన తరుణ్, ఆర్తి అగార్వల్ ని హీరో హీరోయిన్ గా పెట్టి నువ్వులేక నేను లేను అనే సినిమా తీసిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా మంచి విజయం సాధించింది అయినా కూడా ఆయన ఆ తర్వాత నటుడు గా మారి నచ్చావులే, బిందాస్, నమో వేంకటేశ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తిపు తెచ్చుకున్నాడు…ఇలా ఇండస్ట్రీ లో సినిమాలు డైరెక్షన్ చేసి ఆ తర్వాత నటులు గా మరీనా వాళ్ళు ఇంకా చాలా మందే ఉన్నారు…
.







