బింబిసారుడు చేసే యుద్దం ఎలా ఉంటుందో ఆగస్ట్ 5న చూస్తారు.‘బింబిసార’ ఫస్ట్ సింగిల్‌పై డైరెక్టర్ వశిష్టకెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లోనటిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్.
‘బింబిసార’ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు.నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.
కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్.
వశిష్ఠ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈ సినిమా ట్రైలర్‌ను రీసెంట్‌గా విడుదల చేయగా విశేషమైన స్పందన లభించింది.
ఇక నేడు (జూలై 13)గురుపూర్ణిమ సందర్భంగా బుధవారం ఈ మూవీ నుంచి మొదటి పాటను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో
డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ.
‘మీడియాకు, నందమూరి అభిమానులకు, ప్రేక్షకులందరికీ థ్యాంక్స్.మా ట్రైలర్‌కు విశేషమైన స్పందన ఇచ్చిన ఆడియెన్స్‌కు థ్యాంక్స్.
ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన చిరంతన్ గారి, అద్బుతమైన సాహిత్యం ఇచ్చిన శ్రీమణి గారికి, పాడిన కాళ భైరవకు థ్యాంక్స్.ఈ పాట మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను.
మా బింబిసారుడి త్రిగర్తల రాజ్యం నుంచి మొదటి పాట.ఇలాంటివి ఇంకా వస్తాయి.కర్మ సిద్దాంతాన్ని ఆధారంగా ఈ పాట నేపథ్యాన్ని తీసుకున్నాం.బింబిసారుడు చేసే యుద్దం ఎలా ఉంటుందో ఆగస్ట్ 5న చూస్తారు’ అని అన్నారు.
సంగీత దర్శకుడు మాట్లాడుతూ.
‘నాకు తెలుగు అంతగా రాదు.గురుపూర్ణిమ సందర్భంగా ఈ పాటను విడుదల చేసినందుకు ఆనందంగా ఉంది.ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్.వశిష్ట్‌కు ఇది ఫస్ట్ సినిమా.ఆయనకున్న ప్యాషన్ నాకు ప్రతీ మీటింగ్‌లో అర్థమైంది.
ఈశ్వరుడే అనే ఈ పాట కర్మ చుట్టూ తిరుగుతుంది.దీన్ని కంపోజ్ చేయడం నాకు చాలెంజింగ్‌గా అనిపించింది’ అని అన్నారు.
లిరిసిస్ట్ శ్రీమణి మాట్లాడుతూ.
‘ఇంత మంచి పాట రాసే అవకాశం ఇచ్చిన టీంకు థ్యాంక్స్.ఎంతో గొప్పగా కంపోజ్ చేశారు. కాళ భైరవ గారు తన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు.నాకు ఈ చాన్స్ ఇచ్చిన హరి గారు, కళ్యాణ్ రామ్ గారికి థ్యాంక్స్’ అని అన్నారు.