గ్రేట్ : సొంత ఊరు కోసం విరాళమిచ్చిన అల్లు అర్జున్ డైరెక్టర్..

ఏ దేశమేగినా సొంత ఊరిని కన్నవారిని మర్చిపోకూడదని అంటారు పెద్దలు.

అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తన సొంత ఊరిలో రోజువారి కూలీలు మరియు పూట గడవని పేదవాళ్లు పస్తులతో ఇబ్బందులు పడుతున్నారని తెలిసి టాలీవుడ్ కి చెందినటువంటి ఓ ప్రముఖ డైరెక్టర్ తన గ్రామం కోసం ఏకంగా 5 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు.

టాలీవుడ్లో ప్రముఖ విలక్షణ దర్శకుడు సుకుమార్ గురించి తెలియని వారుండరు.అయితే సుకుమార్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కి చెందిన మట్టపర్రు అనే గ్రామంలో పుట్టి పెరిగాడు.

ఆ తర్వాత చదువులు పూర్తయి సినిమాల నిమిత్తం హైదరాబాదులో స్థిరపడ్డాడు.అయితే తాజాగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుండడంతో దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ అత్యవసరం లాక్ డౌన్ ని  విధించారు.

దీంతో పలువురు పేదలు మరియు రోజువారీ కూలీలు తమ కుటుంబాలు గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మరికొంతమంది తిండి లేక పస్తులు ఉంటున్నారు.

Advertisement

దీంతో సుకుమార్ తన గ్రామంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని తెలుసుకోవడంతో వెంటనే తన గ్రామానికి 5 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు.అయితే ఈ డబ్బులు గ్రామంలో ఎవరైతే రోజువారి కూలీలు, అలాగే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి వారికి సహాయం అందించేందుకు గాను ఉపయోగించాలని సూచించాడు.సొంత తల్లిదండ్రులనే సరిగా పట్టించుకోని ఈ కాలంలో ఇలా తన జన్మించిన ఊరి కోసం తోచినంత సహాయం చేసిన సుకుమార్ కి గ్రామస్తులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సుకుమార్ యాక్షన్ మరియు త్రిల్లర్ ఓరియంటెడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రంలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బన్నీ హీరోగా నటిస్తుండగా కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.

 .

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు