Ratan Tata Sudha Kongara : రతన్ టాటా బయోపిక్ పై స్పందించిన డైరెక్టర్ సుధా కొంగర!

గత ఏడాది సూర్య హీరోగా ఆకాశమే నీ హద్దురా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నారు దర్శకురాలు సుధా కొంగర.ఈ సినిమాతో ఈమె పేరు పెద్ద ఎత్తున మారుమోగిపోయింది.

 Director Sudha Kongara Reacted On Ratan Tata Biopic ,director Sudha Kongara , Ra-TeluguStop.com

ఇక ఈ సినిమాకి గాను జాతీయ ఉత్తమ దర్శకురాలిగా అవార్డును కూడా అందుకున్నారు.ఇలా సుధా కొంగర పేరు ఒక్కసారిగా సంచలనంగా మారింది.

ఇకపోతే తాజాగా ఈమె తన తదుపరి ప్రాజెక్ట్ ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి రతన్ టాటా జీవిత కథ ఆధారంగా సినిమా చేయబోతున్నారని ఈ సినిమాలో కూడా హీరోగా సూర్య నటించబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇలా రతన్ టాటా బయోపిక్ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎట్టకేలకు ఈ వార్తలపై స్పందించిన సుధా కొంగర ఈ సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తనకు రతన్ టాటా అంటే ఎంతో ఇష్టమని అయితే తాను మాత్రం ఆయన బయోపిక్ చేయడం లేదు అంటూ సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు.త్వరలోనే తన తదుపరి సినిమాల గురించి అన్ని విషయాలను ప్రకటిస్తానని ఈమె తెలిపారు.

Telugu Sudha Kongara, Keerthy Suresh, Surya-Movie

ఇక రతన్ టాటా బయోపిక్ విషయంలో క్లారిటీ రావడంతో తన తదుపరి చిత్రాన్ని కీర్తి సురేష్ లేడీ ఓరియంటెడ్ చిత్రంగా హోం భలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థలో చేయబోతున్న సినిమా కోసం దర్శకురాలిగా పనిచేస్తున్నారని వార్తలు వినపడుతున్నాయి.మరి ఇదే విషయాన్ని సుధా త్వరలోనే అధికారకంగా తెలియజేస్తారా లేక ఇతర ప్రాజెక్టుల గురించి వెల్లడిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube