ఫ్లాప్‌ డైరెక్టర్‌ వింత ప్రయోగంకి రెడీ.. అవసరమా అంటూ ట్రోల్స్‌

కొత్త బంగారు లోకం అంటూ యూత్ ఆడియన్స్ కి పిచ్చెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.( Srikanth Addala ) ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రూపొందించిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.

 Director Srikanth Addala New Film Goes Update Details, Srikanth Addala, Narappa,-TeluguStop.com

మహేష్ బాబు మరియు వెంకటేష్ కలిసి నటించిన ఆ మల్టీ స్టారర్‌ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.దాంతో బ్రహ్మోత్సవం సినిమాను చేసే అవకాశంను మహేష్ బాబు పిలిచి మరీ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు ఇస్తే అది కాస్త బొక్క బోర్లా పడింది.

దాంతో మళ్లీ గ్యాప్‌ వచ్చింది.నారప్ప సినిమా తో( Narappa ) మళ్లీ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసి సఫలం అయ్యాడు.

ప్రస్తుతం మరో సినిమా తో శ్రీకాంత్‌ అడ్డాల ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.కొత్త హీరో తో ఒక పొలిటికల్‌ డ్రామా ను ( Political Drama ) చేయబోతున్నాడట.ఆ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.ఈ మధ్య కాలంలో రెండు భాగాల సినిమా లు ఎక్కువ అవుతున్నాయి.కనుక ఈ సినిమా ను కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

శ్రీకాంత్ అడ్డాలను నమ్మి ఈ సినిమా కోసం దాదాపుగా రూ.50 కోట్ల బడ్జెట్‌ ను ఖర్చు చేసేందుకు ఎవరు ముందుకు వస్తారు అనేది చూడాలి.ఇక హీరో విషయంలో కూడా త్వరలో ఒక క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నారు.

మొత్తానికి శ్రీకాంత్‌ అడ్డాల ఒక గట్టి ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సమయంలో కొందరు మాత్రం ఫ్లాప్ దర్శకుడికి ప్రయోగాలు అవసరమా.

రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమా ను చేయకుండా కొత్తగా ఇలాంటి ప్రయోగాలు చేడయం వల్ల ఫలితం తారు మారు అయితే పరిస్థితి ఏంటి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube