యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సినిమాలు విభిన్నంగా ఉంటాయి.కమర్షియల్ హిట్ సాధించక పోయిన రెగ్యురల్ ఫార్మాట్ లో కాకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉంటాడు.
అయితే ఈయన గత కొన్నేళ్లుగా హిట్ లేక బాధ పడుతున్నాడు.కానీ విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
ఈ సినిమా ఇచ్చిన విజయాన్ని అలాగే కొనసాగించాలని దూకుడుగా వ్యవహరిస్తున్నాడు.ఈ సినిమా పుణ్యమా అని లాక్ డౌన్ ముందు ఆగిపోయిన ఇండియన్ 2 ఇప్పుడు రీస్టార్ట్ చేసారు.విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇండియన్ 2.1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కిస్తున్నాడు శంకర్.
తాజాగా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కమల్ హాసన్ మరోసారి తన నటనలోని విశ్వరూపాన్ని ప్రేక్షకులకు చూపించ బోతున్నాడట.
ఈ సినిమాలో ఒక 10 నిముషాల డైలాగ్ ను కట్ లేకుండా కమల్ పూర్తి చేసినట్టు టాక్.

కమల్ నటన గురించి వేరే వాళ్ళు చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలో ఈయన 10 నిముషాల డైలాగ్ ను ఏకధాటిగా చెప్పడమే కాకుండా ఆ డైలాగ్ లోనే 14 బాషలు ఉంటాయట.ఆ 14 భాషలను కలిపి కట్ లేకుండా చెప్పడం ఈయనకు మాత్రమే చెల్లింది అంటున్నారు యూనిట్ సభ్యులు.
చూస్తుంటే ఈ సినిమా మరో ఎపిక్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఇక ఈ సినిమాలో కమల్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.







