అన్నగారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు కామెంట్స్!

నేడు సీనియర్ నటుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి కావడంతో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.ఇకపోతే నేడు ఎన్టీఆర్ శతజయంతి కావడంతో పెద్ద ఎత్తున నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.

 Director Raghavendra Rao Comments On Sr Ntr , Director Raghavendra Rao,sr Ntr ,-TeluguStop.com

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుని ఆయనకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ… నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనకు శతకోటి వందనాలు అంటూ ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు.

తాను కాలేజీ చదువుకునే రోజులలో ఎన్టీఆర్ సినిమాలు చూసి నా జీవితంలో ఒక్కసారైనా ఆయనతో కలిసి సినిమా చేయగలనా అని అనుకున్నానని అయితే అదృష్టవశాత్తు ఆయనతో కలిసి ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసే అవకాశం నాకు కలిగిందని రాఘవేంద్ర రావు తెలిపారు.

Telugu Raghavendra Rao, Nandamuritaraka, Sr Ntr, Telugu, Tollywood-Movie

నా కెరీర్లో మొదటిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన సినిమాకు చేయడం, ఆయనపై క్లాప్ కొట్టడం నా అదృష్టంగా భావిస్తాను.అదే విధంగా ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అడవిరాముడు సినిమాకు దర్శకుడిగా ఎన్టీఆర్ నన్ను ఎంపిక చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం అంటూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.అడవి రాముడు అఖండమైన విజయాన్ని అందుకోవడంతో ఆయనతో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసే అవకాశం నాకు కలిగిందని, ఇవాళ ఇండస్ట్రీలో నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం అన్నగారే,ఆయన రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ రాఘవేంద్రరావు ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube