కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలలో హీరో, విలన్లు గడ్డంతో కనిపించడానికి కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే?

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన కేజీఎఫ్, కేజీఎఫ్2 ఒక సినిమాను మించి మరొకటి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాలను గమనిస్తే ఈ సినిమాలలో హీరో, విలన్లు అనే తేడాల్లేకుండా అందరూ గడ్డంతోనే కనిపించడం గమనార్హం.

 Director Prashant Neel Comments About Kgf Kgf2 Beards Details Here Kgf , Kgf2,-TeluguStop.com

దర్శకుడు ప్రశాంత్ నీల్ సాధారణంగానే ఈ విధంగా గడ్డం పెట్టి ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు.అయితే కేజీఎఫ్, కేజీఎఫ్2 హీరో, విలన్ల గడ్డం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి.

కొంతమంది తనకు కోపం తెప్పించడం వల్లే కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలలోని పాత్రలను గడ్డంతో చూపించానని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు.ఉగ్రమ్ సినిమాతో ప్రశాంత్ నీల్ దర్శకుడిగా కెరీర్ ను మొదలుపెట్టారనే విషయం తెలిసిందే.

ఉగ్రమ్ మూవీ విడుదలయ్యే వరకు ప్రశాంత్ నీల్ గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలు విడుదలయ్యే వరకు ప్రశాంత్ నీల్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు కూడా పెద్దగా తెలియదు.

Telugu Beards, Kgf, Prashant Neel, Raveena Tandon, Sanjay Dutt, Srinidhi Shetty,

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ఉగ్రమ్ సినిమా చేసే సమయంలో తాను క్లీన్ షేవ్ తో ఉన్నానని ఆ సమయంలో ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి నువ్వేనా ఈ సినిమా డైరెక్టర్ అని అడగడంతో ఆ సమయంలో నాకు చాలా కోపం వచ్చేదని ప్రశాంత్ నీల్ వెల్లడించారు.ఆ కోపం వల్లే తాను కేజీఎఫ్ సినిమాలో గడ్డం పెట్టించానని ఆయన చెప్పుకొచ్చారు.అలా చాలాసార్లు జరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన వెల్లడించారు.అయితే ఇప్పుడు దేశవిదేశాల్లో ప్రశాంత్ నీల్ పేరు మారుమ్రోగుతోంది.ప్రశాంత్ నీల్ భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.ఈ ప్రాజెక్టులతో ప్రశాంత్ నీల్ ప్రేక్షకుల అంచనాలను అందుకుని విజయాలను ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube