లాంగ్ గ్యాప్ తరువాత - మల్లి మెగా ఫోన్ పడుతున్న స్టార్ డైరెక్టర్ ' ఏ .ఆర్ మురగదాస్ '

Director Muruga Doss Next Movie With Hero Shiva Karthikeyan Details, A.R. Murugadoss , Sivakarthikeyan ,director Muruga Doss , Hero Shiva Karthikeyan, Muruga Doss Shiva Karthikeyan Movie, Kollywood, Allu Arjun, Hero Surya, Murugadoss New Movie

కొన్ని సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించలేకపోయిన మూవీస్ లోని కాన్సెప్ట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది .ఇక సినిమా అంటే కొంత మందికి ఎంటర్ టైన్మెంట్ , మరి కొంతమందికి మూవీ లో సందేశం ఉంటే బాగుటుంది అని అనుకొంటారు .

 Director Muruga Doss Next Movie With Hero Shiva Karthikeyan Details, A.r. Muruga-TeluguStop.com

రొటీన్ కు బిన్నంగా సినిమాలను తెరెక్కించే అతి కొద్దీ మంది డైరెక్టర్స్ ఏ.ఆర్ మురగదాస్ ఒకరు .మురగదాస్ సినిమాలు చూసినట్లు అయితే , తన మూవీస్ లో సింపుల్ స్టోరీ లైన్ ఉంటుంది , అలానే ఎక్కువ మాస్ ఎలిమెంట్స్ కనిపించవు , హీరోయిజమ్ షాట్స్ , ఎలివేషన్స్ , మాస్ సాంగ్స్ , ఇవి అన్ని సమపాళ్ళు ఉంటూనే , కాన్సెప్ట్ అనేది అంతర్లీనంగా ఉంటుంది .2002 లో రమణ మూవీ తో మొదలైన మురగదాస్ సినీ జర్నీ నుండి ఎన్నో వైవిధ్యమైన సినిమాలు వచ్చాయి,

అయితే కొన్ని సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ గా విజయం అందుకొకయిన , మురుగదాస్ మూవీ కాన్సెప్ట్ అలానే స్టోరీ లైన్ కు మాత్రం ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యేవారు.ఒకప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు క్యూ కట్టేవారు.ఇక అసలు విషయానికి వస్తే .గత కొంత కాలంగా మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించనంత స్థాయి లో విజయం అందుకోలేకపోయాయి.ఇక చివరిగా 2018 లో మురగదాస్ – సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ దర్బార్.

ఈ మూవీ ట్రైలర్స్ అండ్ టీజర్స్ , సాంగ్స్ , రజనీకాంత్ పవర్ ఫుల్ యాక్టింగ్ , ఫైట్స్ , సిస్టర్ సెంటిమెంట్ సీన్స్ , ఇలా అన్నిటితో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ప్రేక్షకులను నిరుత్సాహపరిచింది.ఇక దర్బార్ మూవీ తరువాత మురగదాస్ ఏ మూవీ అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు .దర్బార్ సినిమా రిజల్ట్ తరువాత డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తో మూవీ చేయడానికి స్టార్ హీరోస్ అందరు భయపడ్డారు .

Telugu Ar Murugadoss, Allu Arjun, Muruga Doss, Surya, Kollywood, Murugadoss, Siv

మురుగదాస్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీ సిద్ధం చేస్తున్నట్లు చాలా లాంగ్ బ్యాక్ సోషల్ మీడియా లో కొన్ని వార్తలు కూడా వచ్చాయి.అలానే స్టార్ హీరో సూర్య కోసం కూడా ఒక పవర్ ఫుల్ స్టోరీని కూడా సిద్ధం చేసినట్లు సోషల్ మీడియా లో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది .దీంతో ఆయనకు ఆఫర్స్ సన్నగిల్లాయి.ఈ క్రమంలో పూర్తి స్దాయి నమ్మకం కలిగాకే సినిమా మొదలెడదామని చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నారు.ఇక మధ్య మధ్యలో స్టోరీలైన్స్ అనుకుని హీరోలను కలుస్తున్నారు.

అలానే ఆ మధ్య విజయ్‌ హీరోగా చిత్రం చేయబోతున్నారని న్యూస్ స్ప్రెడ్ అయింది .ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ ,మురుగదాస్ రేస్ లో వెనక్కిపడిపోయారు .ఈనేపథ్యంలో మురుగదాస్‌ తరువాత మూవీ ఏమిట .? అనే ప్రశ్న సినీ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది .తాజాగా ఈయన బాలీవుడ్‌లో ఇద్దరు స్టార్‌ హీరోలతో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తుంది .సల్మాన్‌ఖాన్, షారూక్‌ఖాన్‌ హీరోలుగా హిందీలో మల్టీస్టార్‌ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు న్యూస్ వినిపిస్తుంది … 1995లో కరణ్‌ అర్జున్‌ అనే చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు.

Telugu Ar Murugadoss, Allu Arjun, Muruga Doss, Surya, Kollywood, Murugadoss, Siv

ఆ తరువాత కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రలో మెరిశారు.అయితే పూర్తిస్థాయి చిత్రాన్ని మాత్రం ఇప్పటి వరకు చేయలేదు.దీంతో మురుగదాస్‌ చిత్రంపై అంచనాలు పెరిగాయి.కానీ ఈ మూవీ ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు .ఇక ఈ క్రమంలో ఓ ప్రాజెక్టు కన్ఫర్మ్ గా సెట్ అయ్యిందనన్నట్లు తెలుస్తోంది.మరి ఆ హీరో ఎవరో కాదు హీరో మరెవరో కాదు హీరో శివ కార్తికేయన్.

ఈ సినిమాను లైట్‌ హౌస్‌ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాపై త్వరలోనే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాశం ఉంది.దళపతి విజయ్ తో ‘తుపాకి’ చిత్రాన్ని తీసి మళ్ళీ అదే చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్ తో ‘హాలిడే’గా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

ఆ తర్వాత మురుగదాస్ వరుసగా పరాజయాలు చవిచూశారు.ఇక హీరో శివకార్తికేయన్ చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి వస్తానని భావిస్తున్నారు.

ఇక ఈ మూవీ తో హిట్ అందుకొని సక్సెస్ ట్రాక్ లోకి రావాలి అంటూ మురుగదాస్ అభిమానులు ఆశిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube