Lokesh Kanagaraj : లగ్జరీ కారును కొనుగోలు చేసిన లోకేష్ కనగరాజ్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే?

దర్శకుడు లోకేష్ కనగరాజ్( Lokesh kanagaraj ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమాను తెరకెక్కించి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు లోకేష్ కనగరాజ్.

 Director Lokesh Kanagaraj Buys Luxury Bmw Car-TeluguStop.com

కాగా లోకేష్ తో మూవీ చేయాలని స్టార్ హీరోలు వెయిట్ చేస్తున్నారంటే ఆయన రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.కేవలం కోలీవుడ్‌లోని స్టార్ హీరోలే కాదు మిగిలిన ఇండ‌స్ట్రీలోని హీరోలు వెయిట్ చేస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.

గ్యాంగ‌స్ట‌ర్ సినిమాల‌తో ఒక స‌రికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశాడు.ఖైదీ, విక్ర‌మ్ సినిమాలు కోలీవుడ్‌ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వ‌సూళ్ల‌నే సాధించాయి.

అంతేకాకుండా ప్రస్తుతం కోలీవుడ్‌ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం( Remuneration ) అందుకుంటున్న దర్శకుల‌లో లోకేష్ కనగరాజ్ కూడా ఒక‌రు.ఇది ఇలా ఉంటే తాజాగా ఆయ‌న ఒక ఖరీదైన కారును కొనుగోలు చేశారు.బీఎండబ్ల్యూ 7 సిరీస్ కు చెందిన లేటెస్ట్ వ‌ర్ష‌న్ కారును కొనుగోలు చేశాడు.కాగా ఈ కారు ధ‌ర అక్ష‌రాల రూ.1.70 కోట్లు.కారు కొనుగోలు చేసిన తర్వాత లోకేష్ కారుతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కోలీవుడ్ ప్రేక్షకులు నెట్టిజన్స్ ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో కమల్ హాసన్ లోకేష్ కి ఒక కాస్ట్లీ కారుని గిఫ్ట్ గా ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.

కాగా తాజాగా లోకేష్ కనగరాజ్ కొనుగోలు చేసిన కారు ధర తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.ఇకపోతే లోకేష్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన.కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్‌( Vijay ) తో లియో సినిమాని తెర‌కెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రంలో త్రిష,అర్జున్, సంజయ్ దత్, గౌతమ్ మీనన్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి కాగా డ‌బ్బింగ్‌, స‌హా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

ఈ మూవీ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.ఈ చిత్రాన్ని దాదాపు 250 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఈ సినిమా త‌మిళ‌, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ బాష‌ల్లో రీలీజ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube