ప్రస్తుతం తమిళ్ సినిమా దర్శకులందరు( Tamil Directors ) తెలుగు సినిమా హీరోల మీద పడుతున్నారు.అక్కడ వాళ్ల హీరోలతో చేస్తే వర్కౌట్ అవ్వడం లేదని మన తెలుగు హీరోలను పెట్టి సినిమా చేస్తే పాన్ ఇండియా సినిమాగానే కాకుండా మార్కెట్ పరంగా కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశ్యం తోనే మన హీరోలను టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందులో భాగంగానే రీసెంట్ గా లింగు స్వామి నాగార్జునకు ఒక కథ చెప్పినట్టుగా తెలుస్తుంది.అయితే లింగుస్వామి( Director Lingusamy ) ఇంతకుముందు చేసిన పందెంకోడి, ఆవారా లాంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నప్పటికీ, ఆయన గత చిత్రమైన వారియర్ సినిమా( Warrior Movie ) భారీ డిజాస్టర్ అయింది.
ఇక తెలుగులో యంగ్ ఎనర్జిటిక్ స్టార్ గా పేరుపొందిన రామ్ ను హీరోగా పెట్టి చేసిన ఆ సినిమా భారీ ప్లాప్ అవ్వడంతో ఆయనకు అవకాశాలు ఇచ్చే హీరోలు కరువయ్యారు.

దాంతో సీనియర్ హీరో అయిన నాగార్జున( Nagarjuna ) తో ఒక భారీ సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.ఇక అందులో భాగంగానే ఆయనకి ఒక మంచి కథను కూడా చెప్పాడట.అయితే ఆ కథ విన్న నాగార్జున ఈ సినిమా మనం చేద్దాం కానీ ఇంతకంటే ముందు అఖిల్ తో ఒక సినిమా చేయమని ఆయనకి చెప్పారట.
దాంతో లింగస్వామి అఖిల్( Akkineni Akhil ) తో సినిమా అనగానే ఒకసారి కంగారు పడిపోయినట్టుగా తెలుస్తుంది.

ఎందుకంటే ఇప్పటివరకు ఎంతమంది డైరెక్టర్లు ఆయనతో సినిమాలు చేసిన కూడా ఒక సక్సెస్ ని కూడా అందుకోలేకపోయారు.ఇక ప్రస్తుతం ఆయన ఫ్లాపుల్లోనే ఉన్నాడు కాబట్టి తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవకాశం అయితే ఉంది.మళ్ళీ అఖిల్ ని డీల్ చేసి ఏ మాత్రం తప్పటడుగు వేసిన కూడా ఆయన కెరీర్ కె ప్రమాదం అనే ఉద్దేశ్యం లో తను ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి వీళ్ళ కాంబో లో సినిమా వస్తుందా లేదా అనేది…
.