డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి అంటూ జోరుగా ప్రచారం.. వైరల్ వార్తల్లో నిజమెంత?

సినిమా ఇండస్ట్రీలో ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత కొన్ని కొన్ని కారణాలకే విడాకులు తీసుకొని విడిపోవడం అన్నది కామన్.

ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు ( Celebrities )ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.

కాగా సోషల్ మీడియాలో తరచూ ఎవరో ఒక సెలబ్రిటీ కి సంబంధించి ప్రేమ పెళ్లి వార్తలపై రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ ( Director Krish )పెళ్లికి సంబంధించి పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

దర్శకుడు క్రిష్ కూడా మరోసారి వివాహం చేసుకోబోతున్నాడనే రూమర్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.2016లో రమ్య( Ramya ) అనే ఒక డాక్టర్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు కారణంగా 2021లో అనగా పెళ్లైన ఐదేళ్లకే విడాకులు తీసుకొని విడిపోయారు.

అప్పటినుంచి సింగిల్గానే ఉంటున్నారు దర్శకుడు క్రిష్.అయితే ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడట.

Advertisement

ఒక లేడీ డాక్టర్‌ తో త్వరలో పెళ్లి జరగనుందని తెలుస్తోంది.వచ్చే వారం నిశ్చితార్థం జరుపుకోనున్నారనే టాక్.

క్రిష్‌ పెళ్లి చేసుకోబోయే మహిళకు ఇదివరకే పెళ్లయి విడాకులు తీసుకుందని, 11 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడని అంటున్నారు.మరి ఈ రూమర్స్ నిజమేనా లేక ఫేక్ నా అనేది తెలియాల్సి ఉంది.మరి ఈ వార్తలపై దర్శకుడు క్రిష్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.కాగా డైరెక్టర్ క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాతో పాటు అనుష్క నటిస్తున్న ఘాటీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు