నందమూరి హీరో బాలకృష్ణ త్వరలో తన 100వ సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే.భారీ స్థాయిలో అంచనాలున్న బాలయ్య వందవ సినిమాకు మొదట బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తాడని అంతా అనుకున్నారు.
బాలయ్య కూడా అదే విషయాన్ని పలు సార్లు చెప్పుకొచ్చాడు.‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లను అందించిన కాంబినేషన్ మరో సినిమాను ఇవ్వబోతుంది అంటూ సినీ వర్గాల్లో వార్తలు వచ్చాయి.
కాని తాజాగా బాలయ్య తన వందవ సినిమాను తన గత చిత్రం ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా చేయబోతున్నాడు.
బోయపాటి శ్రీను ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ‘సరైనోడు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.
భారీ అంచనాలున్న ఆ సినిమా తర్వాత బోయపాటి తర్వాత బాలయ్యతో సినిమా చేసేందుకు స్క్రిప్ట్‌ను రెడీ చేశాడు.అయితే ఈలోపుగా బాలయ్య తన వందవ సినిమాను సింగీతం శ్రీనివాస్‌తో చేయబోతుండటంతో బోయపాటి తీవ్రంగా నిరుత్సాహ పడ్డాడట.
బాలయ్య కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీని సిద్దం చేస్తే ఇలా మరో సినిమాను చేస్తుండటంతో బోయపాటి అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.‘సరైనోడు’ చిత్రం తర్వాత బోయపాటి తన తర్వాత సినిమాను ఎవరితో చేస్తాడా అని ప్రస్తుతం ఆసక్తిగా ఉంది.