అప్పుడు ఎన్టీఆర్ ఎవరో తెలియదు అన్నాడు.. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో తెలుసా?

బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లు అవుతాయి అని ఒక సామెత ఉంది.ఇలాంటి సామెత కొంతమంది విషయంలో మాత్రం సరిగ్గా సరిపోతుందని అన్న విషయం తెలిసిందే.

 Director Hari About Jr Ntr Details, Director Hari, Junior Ntr, Hero Gopichand, D-TeluguStop.com

ఇక్కడ ఒక దర్శకుడు విషయంలో కూడా ఇలాంటి సామెత బాగా సరిపోయింది అన్నది ప్రస్తుతం అందరూ అంటున్న మాట.ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి విషయంలో మాట్లాడే భాష అయితే జాగ్రత్తగా ఉండాలి.ఎంతైనా ఓడల్లో ఉన్నాము కదా అని బండ్లలో ఉన్న వారిని చులకనగా చేసి మాట్లాడితే ఆ తర్వాత బండ్లు ఓడలు గా మారిపోయి ఓడలు బండ్లు గా మారిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది.ఇప్పుడూ ఇదే జరిగింది అని అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.

ఇంతకీ ఏం జరిగిందంటే…

తమిళంలో సూర్యతో సింగం అనే సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు హరి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదు అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారిపోయాయి.ఎన్టీఆర్ అభిమానులు అందరికి కూడా ఈగో హర్ట్ అయ్యేలా చేసాయ్.ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి దానికి మీరేమంటారు అని అడగగా ఎన్టీఆర్ ఎవరో నాకు తెలియదు అంటూ సమాధానం చెప్పాడు.

అతను అలా చెప్పిన సమయంలో కెరియర్ పరంగా వరుస విజయాలతో పిక్స్ లో ఉన్నాడు దర్శకుడు హరి. ఇక అలాంటి దర్శకుడు ఎన్టీఆర్ గురించి ఎవరో తెలియదు అంటే చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

Telugu Hari, Gopichandhari, Gopichand, Suriya, Jr Ntr, Ntr, Kollywood, Ntr Fans,

ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఎన్టీఆర్ అభిమానులందరికీ దొరికిపోయాడు అదే దర్శకుడు.హరి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ సినిమా రాబోతుంది.గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధించి ప్రచారం జరుగుతోంది.దీంతో సక్సెస్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కూడా తెలియని ఆ దర్శకుడికి ఇక ఇప్పుడు సక్సెస్లు లేకపోవడంతో గోపీచంద్ కూడా తెలిసిన వ్యక్తిగా మారి పోయాడు కదా అని ఎన్టీఆర్ అభిమానులు అందరూ సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు.

అప్పుడు పొగరుగా మాట్లాడిన దర్శకుడు హరి పరిస్థితి ఇప్పుడు ఎలా మారిపోయిందో అంటూ కామెంట్ చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube