ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే జెర్సీ లాంటి మంచి అద్భుతమైన చిత్రాన్ని తన ఖాతాలో వేసుకొని అతి తక్కువ సమయంలోనే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నారు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. ఈయన రామ్ చరణ్ 16 వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ఈ నెల 25వ తేదీ విడుదల కాబోతోంది.ప్రస్తుతం చరణ్ కోలీ వుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC15 సినిమా షూటింగ్ లో చరణ్ బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి సినిమాతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే రామ్ చరణ్ అభిమానులు గౌతమ్ తిన్ననూరికి సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తూ… అన్న మంచి సినిమా తీయండి… రామ్ చరణ్ అన్న క్యారెక్టరైజేషన్ అదిరిపోవాలి.అంటూ డైరెక్టర్ గౌతమ్ కు రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఈ విధంగా అభిమానులు రిక్వెస్ట్ గా అడగడంతో స్పందించిన గౌతమ్ నా సాయశక్తులా ప్రయత్నిస్తాను.తలచుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది.అంతే కాకుండా రామ్ చరణ్ తో సినిమా చేయడమే నాకల అంటూ గౌతమ్ అభిమానులకు రిప్లై ఇచ్చారు.డైరెక్టర్ ఇలా చెప్పడంతో మెగా అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగులో నానితో చేసిన జెర్సీ సినిమా ఎలాంటి విజయం అందుకుందో మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమాని హిందీలో గౌతమ్ డైరెక్షన్ లో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కించారు.
ఈ సినిమా కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమైంది.








