వచ్చే ఏడాది సంక్రాంతి పోటీ రసవత్తరంగా సాగబోతోంది అని అనిపిస్తుంది.2023 సంక్రాంతి రేస్ కోసం స్టార్ హీరోలు ఇప్పటి నుండే పోటీ పడుతున్నారు.ఇక ఈసారి సంక్రాంతికి మన స్టార్ హీరోల్లో ఇద్దరు పోటీకి దిగుతున్నారు.సీనియర్ హీరోలు అయినా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ చాలా ఏళ్ల తర్వాత పోటీ పడబోతున్నారు.
దీంతో ఇరు ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వీరు 6 ఏళ్ల తర్వాత పోటీ పడుతున్నారు.
చిరు ఖైదీ నెంబర్ 150 సినిమాతో సంక్రాంతికి రాగ అదే సమయంలో బాలయ్య గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాతో దిగాడు.కానీ అప్పుడు మెగాస్టార్ సినిమా విజయం సాధించింది.
ఇక ఇన్నేళ్ల తర్వాత మరోసారి ఈ సీనియర్ స్టార్ హీరోలు పోటీ పడబోతున్నారు.ప్రెసెంట్ చిరు చేస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్) ఒకటి.
ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇక బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహ రెడ్డి సినిమా చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలను సంక్రాంతి బరిలో దింపుతున్నట్టు ఇప్పటికే ప్రకటన వచ్చింది.అయితే ఈ రెండు సినిమాల డైరెక్టర్లను చూసి ఫ్యాన్స్ భయపడుతున్నారు.
డైరెక్టర్ బాబీ ట్రాక్ రికార్డ్ అంతగా బాలేదు.పవర్ తర్వాత ఇతడు మరో సక్సెస్ అందుకోలేదు.

సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ, వెంకీ మామ వంటి సినిమాలను చేసిన ఆకట్టుకోలేక పోయాడు.మరి వరుస ప్లాపులతో ఉన్న చిరుకి ఇతడు హిట్ ఇస్తాడో లేదో చూడాలి.ఇక గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాతో ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన ఈయన బాలయ్యతో సినిమా ఒప్పించాడు.మరి ఇదే విజయం కొనసాగుతుందా లేదా అనేది చూడాలి.
ఇలా ఇద్దరు యంగ్ డైరెక్టర్లు ఒకే సారి బరిలోకి దిగనున్నారు.చూడాలి ఏ డైరెక్టర్ ది పై చేయి అవుతుందో.







