సొల్లు కార్చుకునేవారు పాలిటిక్స్ లో సెట్ అవుతారా.. పృథ్వీకి షాకింగ్ కౌంటర్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని పాపులర్ కమెడియన్లలో ఒకరైన పృథ్వీరాజ్ వరుస సినిమా ఆఫర్లతో బిజీ అవుతూ కెరీర్ ను కొనసాగిస్తున్నారనే సంగతి తెలిసిందే.గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేసిన పృథ్వీరాజ్ ఆ శ్రమకు ప్రతిఫలంగా పదవిని పొందాడు.

 Director Geetha Krishna Comments About Comedian Pruthwi Goes Viral Details, Dire-TeluguStop.com

అయితే ఒక వివాదంలో చిక్కుకోవడంతో పృథ్వీరాజ్ కు పదవి దూరం కావడంతో పాటు పార్టీకి కూడా దూరం కావాల్సి వచ్చింది.తాజాగా ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

అయితే పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు పట్టించుకోకపోయినా దర్శకుడు గీతాకృష్ణ మాత్రం ఆ వ్యాఖ్యల గురించి షాకింగ్ కౌంటర్ ఇచ్చారు.సినిమాల్లో కమెడియన్ గా గుర్తింపును తెచ్చుకున్న పృథ్వీరాజ్ కు తక్కువ సమయంలోనే రాజకీయాల్లో ఛాన్స్ దక్కిందని ఆయన తెలిపారు.

ఈ గుర్తింపు పృథ్వీరాజ్ కు కాపు కులానికి చెందిన వ్యక్తి కావడం వల్ల దక్కిన గుర్తింపు కావచ్చని ఆయన చెప్పుకొచ్చారు.

మెగా హీరోలను అప్పట్లో తిట్టడం ఆయనకు ప్లస్ అయ్యి ఉండవచ్చని గీతాకృష్ణ అభిప్రాయపడ్డారు.

Telugu Pruthviraj, Geeta Krishna, Geetakrishna, Geetha Krishna, Heroes, Pruthwir

అలా చేయడంతో ఆయనకు టీటీడీ ఛానల్ ఛైర్మన్ గా గుర్తింపు దక్కిందని గీతాకృష్ణ కామెంట్లు చేశారు.రాజకీయాలలో ఎదగాలని భావించే వాళ్లకు బలహీనతలు ఉండకూడదని అమ్మాయి ఫోన్ చేసిన వెంటనే సొల్లు కార్చుకునే వాళ్లు పాలిటిక్స్ కు ఏ విధంగా సెట్ అవుతారని గీతాకృష్ణ అభిప్రాయపడ్డారు.

Telugu Pruthviraj, Geeta Krishna, Geetakrishna, Geetha Krishna, Heroes, Pruthwir

పృథ్వీరాజ్ కు బలహీనతలు ఉండి కుట్ర జరిగిందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని గీతాకృష్ణ కామెంట్లు చేశారు.పృథ్వీరాజ్ వైసీపీని తిట్టడం వల్ల ఆయనకు మూవీ ఆఫర్లు వచ్చినా వ్యక్తిగా ఎవరూ నమ్మరని గీతాకృష్ణ చెప్పుకొచ్చారు.పృథ్వీ తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడని గీతాకృష్ణ పేర్కొన్నారు.గీతాకృష్ణ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube